చిత్రీకరణ పూర్తిచేసుకున్న చంద్ర సిద్ధార్థ్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
సందేశాత్మక చిత్రాలతో భిన్నమైన కథలను తెరకెక్కించడంలో ముందు వరుసలో ఉంటారు దర్శకుడు చంద్ర సిద్ధార్థ్. 'అప్పుడప్పుడు', ఆ నలుగురు`, అందరి బంధువయా`, మధుమాసం`, 'ఇదీ సంగతి' వంటి సినిమాలు ఈ దర్శకుడి ప్రతిభకి తార్కాణాలు. సుమారు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక మంచి కథతో ఆట కదరా శివా` చిత్రాన్ని తెరకెక్కించారు ఈ విభిన్న చిత్రాల దర్శకుడు.
ఇంత కాలం మంచి కథ లేకనే సినిమాల విషయంలో కొంత గ్యాప్ అవసరమైందని ఈ దర్శకుడు చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో హైపర్ ఆది, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రధారులు కాగా...మిగిలిన నటీనటులంతా కొత్తవారే కావడం విశేషం. ఇటీవలే చిత్రీకరణని ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో తలమునకలై ఉంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టనున్న చిత్ర బృందం....మార్చి నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments