చిత్రీకరణ పూర్తిచేసుకున్న చంద్ర సిద్ధార్థ్ చిత్రం

  • IndiaGlitz, [Tuesday,February 13 2018]

సందేశాత్మక చిత్రాలతో భిన్నమైన కథలను తెరకెక్కించడంలో ముందు వరుసలో ఉంటారు ద‌ర్శ‌కుడు చంద్ర సిద్ధార్థ్. 'అప్పుడ‌ప్పుడు', ఆ నలుగురు', అందరి బంధువయా', మ‌ధుమాసం', 'ఇదీ సంగ‌తి' వంటి సినిమాలు ఈ దర్శకుడి ప్రతిభకి తార్కాణాలు. సుమారు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక మంచి కథతో ఆట కదరా శివా' చిత్రాన్ని తెరకెక్కించారు ఈ విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు.

ఇంత కాలం మంచి కథ లేకనే సినిమాల విషయంలో కొంత గ్యాప్ అవసరమైందని ఈ దర్శకుడు చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో హైపర్ ఆది, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రధారులు కాగా...మిగిలిన నటీనటులంతా కొత్తవారే కావడం విశేషం. ఇటీవలే చిత్రీకరణని ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో తలమునకలై ఉంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టనున్న చిత్ర బృందం....మార్చి నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్ర‌యత్నిస్తోంది.

More News

ఉగాది నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్‌?

గత ఏడాది కాలంగా అలుపన్నది లేకుండా వరుస సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా గడిపారు నందమూరి నటసింహం బాలకృష్ణ. వరుసగా 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'పైసా వసూల్', 'జై సింహా' సినిమా షూటింగ్ లలో పాల్గొని.. నేటి యువ కథానాయకులకు ఛాలెంజ్ విసిరారు బాలయ్య. 'జై సింహా' తర్వాత ఆకట్టుకునే కథలు ఆయన వద్దకు రాకపోవడంతో.. కొంత విశ్రాంతి తీసుకుని నేరుగా ఎన్టీఆర్ బయోపిక్&#

సామ్ , చైతు చిత్రాన్ని నిర్మించనున్న నాని నిర్మాతలు

ఆ జంటను చూసి పులకించడం వెండితెర వంతైతే..వెండితెర పై ఆ జంట కెమిస్ట్రీ చూసి పరవశించడం ప్రేక్షకుల వంతు.‘ఏ మాయ చేశావే’,‘మనం’,‘ఆటోనగర్ సూర్య’ సినిమాలతో ప్రేక్షకులకు కనువిందు చేసిన ఆ జంట..

నాని, కిషోర్ తిరుమల సినిమాకి బ్రేక్ పడిందా?

కొన్ని కాంబినేషన్స్ లో తొలిసారిగా సినిమాలు రాబోతున్నాయంటే ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది.

ప్ర‌మోష‌న్ కోసం..'శివ'ను వాడుకోనున్న వర్మ‌

నాగార్జున, రాంగోపాల్ వర్మ పేర్లు చెబితే ఠక్కున గుర్తుకొచ్చేది 'శివ' చిత్రం. 28 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. 'శివ' పేరు చెబితే పోస్టర్లో ఆ పేరు పై నుంచి చేతితో సైకిల్ చైన్ పట్టుకున్న దృశ్యం గుర్తుకొస్తుంది. అలాగే మొదటి ఫైట్ సన్నివేశంలో.. నాగ్ సైకిల్ చైన్ తెంపే సీన్ కళ్ళ ముందు కదలాడుతుంది.

స్వీటీ డబ్బింగ్ చెప్పలేకపోవడానికి కారణం అదేనా

తెలుగు సినిమాల్లోకి కొత్తగా వస్తున్న పరభాషా కథానాయికలు సైతం డబ్బింగ్ చెప్పుకుంటూ అందరి ప్రశంసలను పొందుతున్నారు.