వరల్డ్ రికార్డ్ సాధించిన చంద్రమహేశ్ 'రెడ్ అలర్ట్'

  • IndiaGlitz, [Wednesday,August 19 2015]

ఏకకాలంలో నాలుగు భాషల్లో సినిమా తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అదో రికార్డ్ లాంటిదే. అందుకే 'రెడ్ అలర్ట్' చిత్రం 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించుకుంది. సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై చంద్రమహేశ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో పీవీ శ్రీరామ్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మించారు. ఏకకాలంలో నాలుగు భాషల్లో రూపొందిన తొలి చిత్రంగా 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్' వారు అభినందించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ వివేకానంద బాబు చిత్రదర్శకుడు చంద్రమహేశ్ కి ఓ ప్రశంసా పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రమహేశ్ మాట్లాడుతూ - ''ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రం రూపొందించాం. మా ప్రయత్నానికి 'ఇండియన్ వరల్డ్ రికార్డ్' దక్కడం ఆనందంగా ఉంది. కన్నడంలో ఈ చిత్రాన్ని విడుదల చేశాం. అక్కడ పెద్ద హిట్ అయ్యింది. ఇటీవలే మలయాళంలో కూడా విడుదల చేశాం.అక్కడ కూడా మంచి స్పందన లభిస్తోంది. దసరా సందర్భంగా తమిళ వెర్షన్ ని విడుదల చేస్తాం. తెలుగు చిత్రం పాటలను ఈ నెలాఖరున, వచ్చే నెలలో తెలుగు వెర్షన్ ను విడుదల చేయాలనుకుంటున్నాం'' అన్నారు. హెచ్.హెచ్. మహదేవ్, రవి,అమర్, తేజ, అంజనా మీనన్ ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతం: రవివర్మ, సహనిర్మాత: శ్రీమతి శ్రీరామ్ పిన్నింటి సత్యరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. జైపాల్ రెడ్డి.