జగన్ రాజధానుల ప్రకటనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో బహుశా మూడు రాజధానులు రావొచ్చని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేశారు. అయితే జగన్ ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనను తుగ్లక్ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. రాజధానిపై స్పష్టత అడిగితే సస్పెండ్ చేస్తారా..? అని జగన్‌పై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం దృష్టికి తీసుకెళ్తా!
‘జగన్ చేసిన రాజధాని ప్రకటనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. మూడు చోట్ల రాజధాని ఉంటే ఉద్యోగులు, ప్రజలు ఎక్కడికి పోవాలి..? మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తే జగన్ ఎక్కడ నివాసం ఉంటారు? అమరావతిలో ఒక ఇల్లు, విశాఖపట్నంలో ఒక ఇల్లు, ఇడుపులపాయలో ఒక ఇల్లు కట్టుకుంటారా?. జగన్‌ను చూస్తుంటే తుగ్లక్ పాలనే కాస్త నయమేమో అనిపిస్తోంది. ఉన్మాది పాలనలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియడం లేదు. జగన్ ప్రతిపాదన రాష్ట్రంలో అస్థిరత్వానికి దారితీస్తుంది. ఈ ప్రకటనతో జగన్ ఉన్మాది అని నిరూపించుకున్నాడు. ప్రజలే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ పాలన చూసి రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరూ పెట్టుబడి పెట్టలేది. జగన్ నిర్ణయం దుర్మార్గం, బాధకరం’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఒకవేళ రాజధాని అంశాన్ని చంద్రబాబు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తే పరిస్తితేంటి..? అనేది కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
జగన్ సంచలన ప్రకటన ఇదీ..!
‘ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ అవసరం ఉంద. సౌతాఫ్రికా మోడల్ తరహాలో ఏపీలో కూడా బహుశా మూడు రాజధానులు ఏర్పాటు చేయవచ్చు. అమరావతిలో చట్టసభలు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. పాలన ఒక దగ్గర.. జుడిషియల్ ఒక దగ్గర ఉంటాయి’ అని అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ ఎవరూ ఊహించని ప్రకటన చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com