టీడీపీకి ‘కళ’ తప్పింది.. ‘అచ్చెన్న’తో అచ్చొస్తుందా!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు మారబోతున్నారా..? 2019 ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారా..? పార్టీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు.. అధ్యక్షుడ్ని మార్చబోతున్నారా..? ఇప్పటికే ప్రజల్లోకి ప్రభుత్వ తప్పొప్పులను చూపిస్తున్న బాబు.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో మార్పులకు శ్రీకారం చుట్టారా..? అంటే తాజా పరిణామాలను చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది.
అందుకేనా!?
ఇప్పటి వరకూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావుతో పార్టీకి ‘కళ’ తప్పిందని.. అందుకే కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని బాబు భావిస్తున్నారట. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు బలంగా వినిపిస్తోందట. అచ్చెన్నతో అయితే పార్టీకి అచ్చొచ్చుస్తుందని ఆయన అనుకుంటున్నారట. మరీ ముఖ్యంగా అచ్చెన్న అయితే పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తారని.. మంత్రిగా పని చేయడం, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయనకు అనుభవం ఉంటుందని.. ఈ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందని పార్టీ నేతలతో బాబు చర్చించగా.. అందరూ ఆయనకే ఓటేశారట. పార్టీ కార్యక్రమాల్లో.. తనకు మంచి వీరవిధేయుడిగా అచ్చెన్న ఉండటంతో ఆయన్నే నియమించాలని బాబు అనుకుంటున్నారట.
ఇదీ ఎర్రన్న ఫ్యామిలీ చరిత్ర!
మరీ ముఖ్యంగా.. టీడీపీకి వీర విధేయులుగా కింజరపు ఫ్యామిలీకి గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే. గతంలో ఎర్రన్నాయుడు పార్టీకి కీలక సేవలందించారు. అటు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కీలక పదవులలో పనిచేసిన ఎర్రన్నాయుడు.. తమ్ముడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆయన కుటుంబం నుంచి ప్రస్తుతం ముగ్గురు కీలక పదవుల్లో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఎంపీగా.. ఆయన సోదరి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా.. అచ్చెన్నాయుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు.. ముగ్గురు కూడా కీలకంగా వ్యవహరిస్తుండటంతో ఆ కుటుంబానికి అధ్యక్ష పదవీ బాధ్యతలు కట్టబెట్టాలని పార్టీ పెద్దలు సన్నాహాలు చేస్తున్నారట. కాగా ఇంతవరకూ అధికారికంగా ప్రకటన రాలేదు కానీ.. గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమైతే పార్టీ ఏ మాత్రం బలోపేతం అవుతుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout