కరోనా మాటలపై జగన్‌కు నోబెల్ ఫ్రైజ్ ఇవ్వాలి : చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి.. టైటిల్ చూడకుండానే సీఎం జగన్ మోహన్ రెడ్డికి నోబెల్ ఫ్రైజ్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవ్వమని అడగడమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును చంద్రబాబు సెటైరికల్‌గా ఇలా అన్నారు. ఇటీవల మీడియా మీట్ నిర్వహించి కరోనా గురించి మాట్లాడిన జగన్.. ‘కరోనా’ నివారణకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్‌ను వాడాలని.. ఇలా చేస్తే కరోనా దరిచేరకుండా చూస్కోవచ్చని తెలిపిన సంగతి తెలిసిందే. ఇందుకు కౌంటర్‌గా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ ప్రజలారా.. జగన్ చెప్పినవన్నీ వాడి చూశారా? పని చేశాయా? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా అవి పని చేస్తే కనుక యావత్తు ప్రపంచానికి చెబితే, అందరూ ఉపయోగించుకుంటారని.. ‘నీకు నోబెల్ ప్రైజ్ కూడా వస్తుంది’ అంటూ జగన్‌పై సెటైర్లు విసిరారు. ఏదో పొరపాటున జగన్ మాట్లాడానని చెప్పాల్సిందిపోయి.. మళ్లీ మళ్లీ సమర్థించుకోవడం ఎంతవరకు సబబు అని చంద్రబాబు విమర్శించారు.
పరువు పోయింది!
‘కరోనా వైరస్ గురించి ప్రస్తావిస్తూ సీఎం జగన్ ఎంతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుని, పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే చాలంటూ వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదు. జగన్ మోహన్ రెడ్డిగా ఆయన అజ్ఞానం గురించి అర్థం చేసుకోగల్గుతాం కానీ.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. దీని వల్ల ఏపీలోని అధికారులు, డాక్టర్ల పరువు పోయింది’ అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ఎన్నికల విషయమై..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ‘సుప్రీంకోర్టు తీర్పును సైతం వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించే వారిని ఏమనాలి?. సభ్యత, సంస్కారం లేని వ్యక్తులు వైసీపీ నేతలు. దేశంలో ‘కరోనా’ వ్యాప్తి చెందడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఎస్ఈసీ తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారు?. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఇష్టం వచ్చినట్టు దూషిస్తారా?. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణా చర్యలు చేపట్టమని ఎన్నో రోజుల నుంచో అడుగుతుంటే వైసీపీ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. అసలు ఏపీ సర్కార్ ఎందుకు సుప్రీం కోర్టుకు వెళ్లింది. అఫిడవిట్‌లో కేంద్రానికి నిధులు రావని ఎందుకు చెప్పలేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు’ అని చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments