హీరోగా మారిన విలన్‌పై చంద్రబాబు ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి వచ్చి హీరోలను జీరోలను చేస్తే.. ఓ విలన్ని మాత్రం రియల్ లైఫ్ హీరోని చేసింది. సోనూసూద్.. ఇప్పుడు ఈ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. సొంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేసి వలస కార్మికులను సొంతూళ్లకు పంపించి సోనూసూద్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీంతో ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన పేరిట టీస్టాల్స్ సైతం వెలిశాయి. తాజాగా ఆయన చేసిన పనితో.. ‘దైవం మానుష రూపేణా..’ అంటోంది ప్రజానీకం. అంతలా ఆకట్టుకున్నారు.
చిత్తూరు జిల్లా మహల్రాజపల్లిలో నాగేశ్వరరావు అనే రైతు తన కూతుళ్లను కాడెద్దులుగా మార్చి పొలం దున్నిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దానిని చూసిన సోనూ చలించిపోయి వారికి జత ఎద్దులను కొనిస్తానని హామీ ఇచ్చి.. కొద్దిసేపటికే ఎడ్లను బదులు ట్రాక్టర్ కొనిస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిందే తడవుగా వెంటనే మదనపల్లెలో సోనాలికా ట్రాక్టర్ డీలర్‌కు కొనుగోలు ఆర్డర్ ఇచ్చి సాయంత్రానికి ట్రాక్టర్‌ను నాగేశ్వరరావు ఇంటికే పంపించేశారు. సోనూ హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ట్రాక్టర్ తమ ఇంటి ముందు ఉండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
ప్రశంసల జల్లు కురిపించిన చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు.. సోనూసూద్‌పై ప్రశంసల జల్లు కురింపించారు. అంతేకాదు రైతు నాగేశ్వరరావు కూతుళ్ల చదువు బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు సోనూ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు మాటలు తనకెంతో స్ఫూర్తినిస్తాయని.. త్వరలో ఆయనను కలుస్తానని సోనూ తెలిపారు. తను తన సినీ కెరీర్‌ను హైదరాబాద్ నుంచే ప్రారంభించానని తెలిపాడు.
Spoke with @SonuSood ji & applauded him for his inspiring effort to send a tractor to Nageswara Rao’s family in Chittoor District. Moved by the plight of the family, I have decided to take care of the education of the two daughters and help them pursue their dreams pic.twitter.com/g2z7Ot9dl3
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 26, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com