ఎక్కడికక్కడ అరెస్ట్లు.. పోలీసుల అదుపులో బాబు, లోకేశ్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రాజకీయ దాడుల వ్యవహారంలో పోలీసుల ఉదాసీన వైఖరి కారణంగా... ఆదిలోనే ఆగిపోవాల్సిన గొడవలు ఇప్పుడు శాంతిభద్రతల సమస్యగా మారడం గమనార్హం. పలుచోట్ల టీడీపీ శ్రేణులు గ్రామాలు విడిచి గుంటూరులోని పునరావాస శిబిరంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికారపార్టీ నేతల దాడుల నుంచి కార్యకర్తలను రక్షించుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు... ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ముఖ్యనేతలు అరెస్ట్!
కాగా.. ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ చేపట్టిన ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గేది లేదని షురూ చేశారు. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకూ ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్లు, స్టేషన్కు తరలించడాలు చేశారు. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, మాజీ మంత్రులు అఖిలప్రియ, అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సర్కార్, పోలీసుల వ్యవహారంపై నిప్పులు చెరిగారు.
నేను గతంలో ఎప్పుడూ చూడలేదు..!
‘ఇంత నిరంకుశత్వాన్ని నేను గతంలో ఎన్నడూ చూడలేదు. శిబిరాల్లోని బాధితులకు ఆహారాన్ని కూడా అడ్డుకున్నారనీ, ఇంతకంటే అమానుషం ఏముంటుంది..?. ఒక్కో టీడీపీ నేత ఇంటి ముందు ఇంత మంది పోలీసులను పెడతారా? బాధితులకు పోలీసులను అండగా ఉంచితే ఈ పరిస్థితి అసలు వచ్చేదా? సొంత ఊరిలో నివసించేందుకు టీడీపీ శ్రేణులు చేస్తున్న పోరాటం ఇది. సొంత భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం ఇది. దానిమ్మ, చీనీ, కొబ్బరిచెట్ల నరికివేత అన్నది ఎక్కడైనా ఉందా? బాధితులకు సంఘీభావంగా ప్రజలంతా అందరూ నిరసనల్లో పాల్గొనాలి. టీడీపీ నేతలు రాష్ట్రమంతా శాంతియుతంగా, ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా నిరసనలు తెలియజేయాలి. బాధితులకు మద్దతుగా తాము చేస్తున్న పోరాటం ఆగదనీ, టీడీపీ డిమాండ్లను పరిష్కరించాల్సిందే’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
భారీ బందోబస్తు..
ఇదిలా ఉంటే.. పోటాపోటీగా టీడీపీ, వైసీపీ నేతలు ‘చలో ఆత్మకూరు’ కు పిలుపు నేపథ్యంలో ఆత్మకూరులో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల నేతలు తరలి వస్తారని భావించిన పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా నిషేధాజ్ఞలు విధించారు. గ్రామంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. మాచర్ల నుంచి ఎక్కడికక్కడ వలయాలుగా ఏర్పడిన పోలీసులు గ్రామంలోకి ఎవరూ రాకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout