మొత్తం మేమే చేశాం.. సీఎంగా జగన్ చేసిందేంటి!
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకొస్తే చాలు.. అది మేమే.. ఇది మేమే ఆ ఘనత మాదే.. అంతా చేసింది మేమే.. అని ఒక్కసారైనా చెబుతుంటారని.. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా వైఎస్ జగన్ సర్కార్‌పై పలువిషయాలను మాట్లాడటానికి మీడియా ముందుకొచ్చారు బాబు. ఈ సందర్భంగా మొత్తం మా టీడీపీ హయాంలోనే చేశాం.. సీఎంగా జగన్ చేసిందేంటి..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడం తప్ప..? అంటూ కన్నెర్రజేశారు. బాగా కాల్చి వాత పెట్టినా ప్రభుత్వం తీరు మారడం లేదంటూ ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అన్నీ మా హయాంలోనే..!
‘వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలను కోర్టులు, నిపుణులు తప్పుబట్టినా ప్రభుత్వానికి అర్థంకావడంలేదు. నాలుగు నెలలుగా మా తప్పుల కోసం వెతుకుతున్నారు. గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి వాలంటీర్ జాబ్ అంటున్నారు. నాలుగు నెలలుగా ప్రజలకు నరకాన్ని చూపించారు. ఇక, గతంలోతప్పులు చేసిన అధికారులంతా జైళ్లకు వెళ్లారు. పీపీఏలపై వైఎస్ జగన్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోంది. మా హయంలో విద్యుత్ రంగానికి 149 అవార్డులు వచ్చాయి. ఈ ప్రభుత్వానికి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తోంది. పీపీఏలపై అనవసరంగా మాట్లాడినవారిపై చర్యలు తీసుకోవాలి. టీడీపీ హయంలో జెన్‌కో, ట్రాన్స్‌కోను దేశంలోనే నెంబర్ వన్ చేశాం. సంస్కరణలతో కరెంట్ కోతలను అధిగమించాం. డిస్కంలకు అప్పులు లేకుండా చేసి.. కరెంట్ కోతల నుంచి మిగులు విద్యుత్ సాధించాం. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనే’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments