క్వశ్చన్ పేపర్ లీకేజి ఫ్యామిలీ ప్యాకేజిగా మారింది!

  • IndiaGlitz, [Sunday,September 22 2019]

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్రామ సచివాలయ పరీక్షా ప్రశ్నా పత్రాలు లీకేజీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్వశ్చన్ పేపర్ లీకేజి ఫ్యామిలీ ప్యాకేజిగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వహణ ఎంతో క్లిష్టమైందని.. శాఖలపై నిరంతర పర్యవేక్షణ, అనుక్షణం అప్రమత్తత అవసరమని బాబు చెప్పుకొచ్చారు.

ఏపీపీఎస్సీ ప్రతిష్టకే మచ్చ వస్తోంది..!

‘సకాలంలో సరైనరీతిలో స్పందించి సమర్ధమైన చర్యలు చేపట్టాలి. పరిపాలనకు అనుభవం ఎంత అక్కరకు వస్తుందో.. కార్యదక్షత అంతకుమించి దోహదకారి అవుతుంది. ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు మీ అనుభవ రాహిత్యం, చేతకానితనం. పక్షపాతంతో పాటు కక్ష సాధింపు వైఖరే కారణం. ఉద్యోగాల పేరుతో 20 లక్షల మంది అభ్యర్థులుకు ఇబ్బందులు పెట్టారు. మీ చర్యల వల్ల ఏపీపీఎస్సీ ప్రతిష్టకే మచ్చ వస్తోంది. ఒక్కో ఉద్యోగాన్ని 4లక్షలకు అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. క్వశ్చన్ పేపర్ లీకేజి ఫ్యామిలీ ప్యాకేజిగా మారింది. ప్రశ్నాపత్రాలు ఏపీపీఎస్సీకి పోకన్నా ముందే రిటైర్డ్ అధికారికి ఎలా చేరాయి?. కమిషన్ ఆఫీస్‌ సిబ్బందికి క్వశ్చన్ పేపర్లు ఎలా అందాయి’ అని జగన్‌ ప్రభుత్వంపై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

More News

మెట్రో స్టేషన్‌లలో ‘బిగ్‌బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు’!

ఇదేంటి.. బిగ్‌బాస్ షో వరకే కదా జాగ్రత్తలు చెబుతున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే..

కోలీవుడ్ వైపు బ‌న్నీ చూపు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ సినిమాల‌కు ఇటు తెలుగు, అటు మ‌ల‌యాళంలో మంచి క్రేజ్ ఉన్నాయి.

మనం సైతం ఐదవ వార్షికోత్సవం

ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ ఐదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

ఇంకో 2-3 పథకాలున్నాయ్.. అవి తీసుకొచ్చానో అంతే!!

తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను కేసీఆర్ సర్కార్ ప్రారంభించింది. మరికొన్ని పథకాలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

గోదారిలో బోటు ప్రమాదం వెనుక పెద్ద స్కాం ఉంది

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బోటు ప్రమాదం వెనుక పెద్ద స్కాం ఉందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు.