జగన్ ఒక ఉన్మాది... నేను తలుచుకుంటే వైసీపీ ఉండేది కాదు.. చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక ఉన్మాది అని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అనంతపురంలో రెండో రోజు పర్యటించిన చంద్రబాబు.. టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను ఖండించారు. పోలీసులు పనిగట్టుకుని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై దాగులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
జగన్ పోలీసులను పక్కనపెట్టి యుద్ధానికి రావాలని... అప్పుడు ఎవరి బలం ఎంతో తెలుస్తుందని సవాల్ విసిరారు బాబు. టీడీపీ లేకుండా చేయాలని జగన్ కుట్రపన్నుతున్నాడని ఆరోపించిన బాబు.... తాను నిశ్ఛయించుకుంటే వైసీపీ ఉండేదే కాదని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీని, ప్రజలను కాపాడుకునేందుకు రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీ నేతల దాడుల గురించి కేసులు పెడితే... రిటర్న్ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు బాబు.
ప్రజావేదిక నుంచే ప్రభుత్వ విధ్వంసం మొదలైందన్న బాబు.... జగన్ వైఖరి పిచ్చోడి చేతికి రాయిచ్చినట్లు ఉందన్నారు. జగన్ ది భస్మాసుర హస్తమని... అందరినీ కొట్టి చిత్రహింసలు పెడుతున్న జగన్... తనకు తాను కూడా కొట్టుకుంటాడని వ్యాఖ్యానించారు. అధికారం ఉందని జగన్ రెచ్చిపోతున్నాడని ... టీడీపీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో తప్పక చూపిస్తామంటూ హెచ్చరించారు బాబు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout