జగన్ ఒక ఉన్మాది... నేను తలుచుకుంటే వైసీపీ ఉండేది కాదు.. చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక ఉన్మాది అని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అనంతపురంలో రెండో రోజు పర్యటించిన చంద్రబాబు.. టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను ఖండించారు. పోలీసులు పనిగట్టుకుని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై దాగులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

జగన్ పోలీసులను పక్కనపెట్టి యుద్ధానికి రావాలని... అప్పుడు ఎవరి బలం ఎంతో తెలుస్తుందని సవాల్ విసిరారు బాబు. టీడీపీ లేకుండా చేయాలని జగన్ కుట్రపన్నుతున్నాడని ఆరోపించిన బాబు.... తాను నిశ్ఛయించుకుంటే వైసీపీ ఉండేదే కాదని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీని, ప్రజలను కాపాడుకునేందుకు రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీ నేతల దాడుల గురించి కేసులు పెడితే... రిటర్న్ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు బాబు.

ప్రజావేదిక నుంచే ప్రభుత్వ విధ్వంసం మొదలైందన్న బాబు.... జగన్ వైఖరి పిచ్చోడి చేతికి రాయిచ్చినట్లు ఉందన్నారు. జగన్ ది భస్మాసుర హస్తమని... అందరినీ కొట్టి చిత్రహింసలు పెడుతున్న జగన్... తనకు తాను కూడా కొట్టుకుంటాడని వ్యాఖ్యానించారు. అధికారం ఉందని జగన్ రెచ్చిపోతున్నాడని ... టీడీపీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో తప్పక చూపిస్తామంటూ హెచ్చరించారు బాబు.

More News

'ఎంత మంచివాడ‌వురా' బ్యూటీఫుల్ మెలోడీ విడుద‌ల

నందమూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా  'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వంలో

అలీకి మాతృ వియోగం.. చిరు, పవన్ ల పరామర్శ

హాస్య నటుడు అలీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో రాజమహేంద్ర వరంలో చనిపోయారు.

కెమెరాతో ప్రకృతిలో ప్రయాణం ... వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ గా చెర్రీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.... మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చెర్రీ..

సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ గెస్ట్ గా చిరు...?

సంక్రాంతి సినిమాలు బరిలోకి దిగేందుకు రె"ఢీ" అవుతున్నాయి. దాదాపు ఏడెనిమిది సినిమాలు బరిలో ఉన్నా..

బాల‌య్య మాట నిల‌బెట్టుకుంటాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ తాజా చిత్రం `రూల‌ర్‌`. క్రిస్మ‌స్ సందర్భంగా ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న విడుద‌లవుతుంది.