48 గంటలు టైమిస్తున్నా.. అసెంబ్లీని రద్దు చేసి రండి: చంద్రబాబు సవాల్

మూడు రాజధానుల అంశం ఏపీలో కాక రేపుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్.. ఇప్పుడు మాట తప్పారనేది ప్రతిపక్షాల వాదన. ప్రతిపక్షాలను ఏమాత్రం లెక్క చేయకుండా జగన్ మాత్రం ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినను అన్నట్టుగా వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ‘48 గంటలు సమయం ఇస్తున్నా.. ఏపీ అసెంబ్లీని రద్దు చేసి రండి.. మళ్లీ ఎన్నికలకు వెళదాం’ అంటూ సవాల్ విసిరారు.

తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారని వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ రాజధాని అంటే కొన్ని గ్రామాల సమస్య కాదని.. కొన్ని కోట్ల మంది సమస్య అన్నారు. ముఖ్యమంత్రి ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More News

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మరో అడుగు ముందుకు పడింది.

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న ‘సాహో’ డైరెక్టర్..

కరోనా మహమ్మారి కారణంగా సెలబ్రిటీల పెళ్లిలన్నీ సింపుల్‌గా జరిగిపోతున్నాయి.

హిట్ డైరెక్ట‌ర్‌ని లాక్ చేసిన మైత్రీ మూవీస్‌..!!

ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఉన్న అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒక‌టి. చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ప్ర‌భాస్‌, మ‌హేశ్‌, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో

ఛానెల్ ఎడిట‌ర్‌పై ఆర్జీవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌

ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో షూటింగ్‌ల‌కు మేక‌ర్స్ దూరంగా ఉంటున్నారు.

చెన్నై సేఫ్ అంటున్న త‌లైవా అండ్ టీమ్‌!!

మ‌న సీనియ‌ర్ స్టార్స్ అంద‌రూ షూటింగ్స్ స్టార్ట్ చేయాలంటే భ‌య‌ప‌డుతున్నారు. వీరిని ఇంత‌లా భ‌య‌పెడుతున్నదెవ‌రో కాదు..