48 గంటలు టైమిస్తున్నా.. అసెంబ్లీని రద్దు చేసి రండి: చంద్రబాబు సవాల్
Send us your feedback to audioarticles@vaarta.com
మూడు రాజధానుల అంశం ఏపీలో కాక రేపుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్.. ఇప్పుడు మాట తప్పారనేది ప్రతిపక్షాల వాదన. ప్రతిపక్షాలను ఏమాత్రం లెక్క చేయకుండా జగన్ మాత్రం ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినను అన్నట్టుగా వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ‘48 గంటలు సమయం ఇస్తున్నా.. ఏపీ అసెంబ్లీని రద్దు చేసి రండి.. మళ్లీ ఎన్నికలకు వెళదాం’ అంటూ సవాల్ విసిరారు.
తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారని వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ రాజధాని అంటే కొన్ని గ్రామాల సమస్య కాదని.. కొన్ని కోట్ల మంది సమస్య అన్నారు. ముఖ్యమంత్రి ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout