పౌర్ణమి సందర్బంగా 'చందమామ రావే' చిత్ర లోగో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యి యూత్ హర్ట్ ని దొచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రానికి చందమామ రావే అనే టైటిల్ ని ఖరారు చేశారు. అది రాదు.. వీడు మారడు అనే చక్కటి క్యాప్షన్ ని ఇటీవలే ఎనౌన్స్ చేశారు. టైటిల్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే క్యాప్షన్ ని హ్యుజ్ రెస్పాన్స్ రావటం చిత్ర యూనిట్ ఆనందంగా వున్నారు. సిని పెద్దలు సైతం ఫోన్స్ చేసి టైటిల్ మరియు క్యాప్షన్ చాలా క్యాచి గా వున్నాయి. చాలా పాజిటివ్ గా వుంది అనటం యూనిట్ సబ్యుల్లో మంచి ఎనర్జి నింపింది. అదే ఎనర్జితో చందమామరావే చిత్ర లోగోని పౌర్ణమి సందర్బంగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని IEF CORPORATION - Italian of the East Films corporation ప్రోడక్షన్ నెం-1 గా నిర్మాతలు కిరణ్ జక్కంశేట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారతదేశంలో నే మెట్టమెదటి సారిగా ట్విన్స్ ధర్మ-రక్ష అనే వారు సంయుక్తంగా దర్శకత్వ భాద్యతలు స్వీకరించారు. ప్రియల్ గోర్ అనే నూతన తార హీరోయిన్ గా చేస్తుంది. చక్కటి ప్రేమకథ కి గ్రాండియర్ విజువల్స్ తోడయితే ఆ చిత్రం ప్రేక్షకులని కనువిందు చేస్తుంది.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. IEF CORPORATION - Italian of the East Films corporation ప్రోడక్షన్ లొ కంటిన్యూస్ గా చిత్రాలు చేస్తాము. మా మెదటి చిత్రం చందమామ రావే- అది రాదు వీడు మారడు కి ఇంత మంచి రెస్పాన్స్ రావటం చాలా ఆనందంగా వుంది. దర్మ-రక్ష లు ఇద్దరు వచ్చి కథ చెప్పినప్పుడు నా నమ్మకమే ఇప్పుడు ఈ టైటిల్ కి పాజిటివ్ రెస్పాన్స్. చాలా మంది ఫోన్స్ చేసి టైటిల్ చాలా బాగుంది సార్ అంటున్నారు. 3 వేరియేషన్స్ ఆఫ్ లవ్‌స్టోరి ఇప్పటి జనరేషన్ కి హర్ట్ కి టచ్ అయ్యే చాలా మంచి పాయింట్ తో అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించిన ఈ చిత్రం తప్పకుండా అందరి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ఇంత మంచి ప్రేమకథ కి నవీన్ చంద్ర యాప్ట్ అనేది చూసిన ప్రతిఓక్కరూ అంటారు.చాలా గ్యాప్ తరువాత నవీన్ నటిస్తున్న చక్కటి ప్రేమకథ ఇది. హీరోయిన్ ప్రియల్ గోర్ ని ఈచిత్రం తరువాత ప్రేక్షకులు లవ్ చేస్తారు అంత క్యూట్ గా వుంది స్క్రీన్ మీద. హిల్ స్టేషన్ లో షూట్ చేస్తే నేచురల్ బ్యూటి క్యాప్చర్ చెయ్యచ్చుకదాని హిమాలయాల్లో ని అందమైన ప్రదేశాల్లో మైనస్ డిగ్రి కోల్డ్ వాతావరణంలో అత్యద్బుతం గా మెదటి షెడ్యూల్ ని, గోవాలొ ఎక్స్ట్రీమ్ హట్ లో రెండవ షెడ్యూల్ ని,, మూడవ షెడ్యూల్ హైదరాబాద్ లోని ఎక్ట్రీమ్ రెయిన్స్ వున్నప్పుడు షూట్ చేశాము దీనికి కారణం మా చిత్రంలో ఎక్సట్రీమ్ లవ్ వుండటంతో మాకు షూటింగ్ టైంలో ఏమాత్రం కష్టం అనిపించలేదు. మా చిత్రంలో చాలా కొత్త అంశాలుంటాయి. నవీన్ చంద్ర లుక్ కొత్తగా వుంటుంది. హీరోయిన్ కి, నవీన్ కి మద్య వచ్చే సన్నివేశాలు తప్పకుండా ఆకట్టుకుంటాయి. ఆ సన్నివేశలు రిపీటెడ్ గా చూసేలా వుంటాయి. అంత అందంగా మా దర్శకుడు ధర్మ-రక్ష లు చాలా క్రీయోటివిటి తొ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పౌర్ణమి సందర్బంగా మా చిత్రం యోక్క లోగో ని విడుదల చేశాము. ఇది కూడా అందరిని ఆకట్టుకుంటుదని మా నమ్మకం.అని అన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com