నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'చందమామ రావే'

  • IndiaGlitz, [Tuesday,November 15 2016]

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమ‌య్యి యూత్ హ‌ర్ట్ ని దొచుకున్న న‌వీన్ చంద్ర చేస్తున్న నూత‌న చిత్రం చందమామ రావే . ప్రియ‌ల్ గోర్ అనే నూత‌న తార హీరోయిన్ గా న‌టిస్తుంది. ''అది రాదు.. వీడు మార‌డు'' అనేది క్యాప్ష‌న్. ఈ చిత్రాన్ని IEF CORPORATION – Italian of the East Films corporation ప్రోడ‌క్ష‌న్ నెం-1 గా నిర్మాత‌లు కిర‌ణ్ జ‌క్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ర‌క్త‌చ‌రిత్ర సినిమాకు రామ్‌గోపాల్ వ‌ర్మ స‌హా ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్స్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన క‌వ‌ల ద‌ర్శ‌కులు ధ‌ర్మ‌-ర‌క్ష ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.

ఈ సంద‌ర్భంగా....

నిర్మాత కిర‌ణ్ జ‌క్కంశెట్టి మాట్లాడుతూ '' ఎంతో మంది స్టార్ డైరెక్ట‌ర్స్ వ‌ద్ద ద‌ర్వ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు ధ‌ర్మ‌, ర‌క్ష‌లు సినిమాను చ‌క్క‌గా రూపొందించారు. ప్ర‌పంచంలో ట్విన్స్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా కూడా మా చిత్ర‌మే కావ‌డం విశేషం. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమా చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. న‌వీన్‌చంద్ర పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. హీరో న‌వీన్‌చంద్ర పూర్తి స‌హ‌కారాన్ని అందించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఖ‌ర్చుకు ఏమాత్రం వెన‌కాడకుండా హిమాల‌యాలు, గ్యాంగ్‌ట‌క్ స‌హా ప‌లు ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. ఇటీవ‌ల టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేసి, సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

More News

నూతన నటీనటులతో పడమటి సంధ్యారాగం లండన్ లో..!

నూతన నటీనటులు చైతు శాంతారామ్,షహేల రాణి జంటగా వంశీ మునిగంటి తెరకెక్కించిన చిత్రం పడమటి సంధ్యారాగం లండన్ లో.

'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా సక్సెస్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను - గౌతమ్ మీనన్

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపోస. మిర్యా సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు.

డిసెంబర్ లో మోహన్ లాల్ 'మన్యం పులి'

మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన తాజా సినిమా పులిమురుగన్ రికార్డుల పరంపర కొనసాగుతోంది.

రజనీకాంత్ తో త్రిష....

పా రంజిత్ తన దర్శకత్వంలో డాన్ క్యారెక్టర్ లో రజనీకాంత్ నటించిన చిత్రం 'కబాలి'.

బాలయ్య రైతుకు బిగ్ బి నో చెప్పడానికి కారణం..!

నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ వైపు 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం చేస్తూనే మరో వైపు 101వ చిత్రం చర్చల్లో పాల్గొంటున్నారు.