నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'చందమామ రావే'
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యి యూత్ హర్ట్ ని దొచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రం చందమామ రావే . ప్రియల్ గోర్ అనే నూతన తార హీరోయిన్ గా నటిస్తుంది. ``అది రాదు.. వీడు మారడు`` అనేది క్యాప్షన్. ఈ చిత్రాన్ని IEF CORPORATION – Italian of the East Films corporation ప్రోడక్షన్ నెం-1 గా నిర్మాతలు కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రక్తచరిత్ర సినిమాకు రామ్‌గోపాల్ వర్మ సహా పలువురు స్టార్ డైరెక్టర్స్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కవల దర్శకులు ధర్మ-రక్ష ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా....
నిర్మాత కిరణ్ జక్కంశెట్టి మాట్లాడుతూ `` ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ వద్ద దర్వకత్వ శాఖలో పనిచేసిన దర్శకులు ధర్మ, రక్షలు సినిమాను చక్కగా రూపొందించారు. ప్రపంచంలో ట్విన్స్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా కూడా మా చిత్రమే కావడం విశేషం. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. నవీన్‌చంద్ర పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుంది. హీరో నవీన్‌చంద్ర పూర్తి సహకారాన్ని అందించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా హిమాలయాలు, గ్యాంగ్‌టక్ సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ఇటీవల టీజర్‌ను విడుదల చేశాం. టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com