చందమామ రావే అది రాదు...వీడు మారడు గో వైరల్ కాంటెస్ట్
- IndiaGlitz, [Friday,May 27 2016]
హీరో నవీన్ చంద్ర నటిస్తున్నతాజా చిత్రం చందమామ రావే. ఈ టైటిల్ కి క్యాప్షన్ అది రాదు.. వీడు మారడు. ఈ టైటిల్ కి చాలా మంచి అప్లాజ్ రావటం విశేషం. ఈ సందర్బంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఐఇఎఫ్ కార్పోరేషన్ - ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్స్ కార్పోరేషన్ నిర్మాతలు కిరణ్ జక్కంశేట్టి, శ్రీని గుబ్బల కొత్త టాలెంట్ ని, కొత్తవారిని ప్రోత్సహించే విధంగా షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మెదటి ప్రయత్నంగా భారతదేశంలో నే మెట్టమెదటి సారిగా ట్విన్స్ ధర్మ-రక్ష అనే దర్శకులుగా పరిచయం చేస్తున్నారు. ప్రియల్ గోర్ అనే నూతన తార హీరోయిన్ గా పరిచయం చేశారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసకున్న ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ఈ సందర్బంగా...
దర్శకులు ధర్మ-రక్ష మాట్లాడుతూ.. ఐఇఎఫ్ కార్పోరేషన్ - ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్స్ కార్పోరేషన్ ప్రోడక్షన్ లొ కంటిన్యూస్ గా చిత్రాలు చేయాలనే వుద్దేశ్యంతో ప్రొడక్షన్ మెదలుపెట్టారు. అంతేకాకుండా ముఖ్యంగా కొత్తవారిని ప్రోత్సహించేవిధంగా అది రాదు..వీడు మారడు అనే ట్యాగ్ లైన్ ని కాన్సెప్ట్ గా తీసుకుని మీకు నచ్చిన విధంగా మీ టాలెంట్ ని 3 నిమిషాల కి మించకుండా మీ జీవితంలో మీ వదలకుండా చేస్తున్న ప్రయత్నం ని దృశ్యరూపం లో మాకు మీకు నచ్చిన కెమెరాలో షూట్ చేసి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసి ఆ లింక్ ని adhiraadu.veedumaaradu@gmail.com పంపించండి.
ఇలా పంపించిన వీడియోస్ లో బెస్ట్ 10 ని సెలక్ట్ చేసి జూన్ మెదటి వారంలో చందమామ రావే ఫ్యామిలి డిన్నర్ లో మా చిత్ర యూనిట్ కలుస్తారు. అక్కడ అందరం కలిసి వారి వారి అనుభవాలు పంచుకుంటాం. అలాగే ఈ పది మందిలో బెస్టాఫ్ త్రి ని ఎంచుకుని చందమామ రావే ఆడియో ఫంక్షన్ లో వారి చేత సాంగ్స్ విడుదల చేయిస్తాం. అంతేకాకుండా వారికి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా మా ముఖ్య అతిధుల చేత అందచేయడం జరుగుతుంది. అది ఓ మంచి సినిమా అవకాశం కూడా కావచ్చు సో గెట్ రెడీ టు మేక్ ఇట్ షార్ట్ ఫిల్మ్.. మీ లింక్ మాకు అందవలసిని చివరి తేది జూన్ 6 , మంచి అవకాశాన్ని వినియోగించుకోండి.. అని అన్నారు ఐఇఎఫ్ కార్పోరేషన్ - ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్స్ కార్పోరేషన్ కెమెరా- వెంకట ప్రసాద్, సంగీతం- శ్రావణ్, ఎడిటర్- ఎస్.ఆర్.శేఖర్ దర్శకత్వం- ధర్మ-రక్ష.