Champai Soren:ఝార్ఖండ్‌ సీఎంగా చంపై సోరన్ ప్రమాణం.. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు..

  • IndiaGlitz, [Friday,February 02 2024]

ఝార్ఖండ్‌(Jharkhand) నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌ (Champai Soren) ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈనెల 10వ తేదీ లోపు అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం(JMM) చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించింది. దీంతో వారంతా శుక్రవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ నగరంలోని ఎల్లా హోటల్‌లో బస ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈనెల 5న బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి అలంగిర్‌ ఆలం వెల్లడించారు.

మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అరెస్టుతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో కొత్త సీఎంగా చంపై సోరెన్‌ను కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలంతా రాజ్ భవన్‌కు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. వీలైనంత త్వరగా చంపై సోరెన్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని అభ్యర్థించారు. వారి అభ్యర్థన మేరకు గురువారం రాత్రి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు.

కాగా ఝార్ఖండ్ అసెంబ్లీకి ఈ ఏడాది చివరల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 81 స్థానాలు ఉండగా.. కేవలం కొల్హాన్‌ ప్రాంతం పరిధిలోనే 13 సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. దీంతో బీజేపీకి చెక్ పెట్టేలా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని సీఎంని చేశారు జేఎంఎం పెద్దలు. అంతేకాకుండా వారసత్వ రాజకీయాలు చేస్తోందంటున్న కమలం నేతల విమర్శలకు కూడా ముకుతాడు వేసినట్లైంది. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు జేఎంఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎంకు 29 మంది, కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీ ఓ స్థానం, సీపీఐ(ఎంల్) పార్టీకి మరో స్థానం ఉండటంతో కూటమి బలం 48గా ఉంది. ఇక ఎన్డీయే కూటమికి 32 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో బలపరీక్షలో ఇండియా కూటమి నెగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా కానీ ఎందుకైనా మంచిదని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. వచ్చే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఝార్ఖండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

More News

YSRCP: మరోసారి వైసీపీదే అధికారం.. జగన్ ప్రభంజనం ఖాయమంటున్న సర్వే..

ఏపీలో ఎన్నికలకు రెండు నెలలు మాత్రమే సమయం ఉండంటతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైసీపీ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధం అంటే..

Thalapathy Vijay:రాజకీయాల్లోకి దళపతి విజయ్.. కొత్త పార్టీ ప్రకటన..

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది.

Bandla Ganesh:మల్కాజ్‌గిరి పార్లమెంట్ టికెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది.

Poonam Pandey:బాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ పాండే కన్నుమూత..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. మోడల్‌గా, హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న పూనమ్ పాండే క్యాన్సర్‌తో మరణించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ సంచలనంగా మారింది.

Sharmila:ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా.. జాతీయ పార్టీల నేతలతో భేటీ..

ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ ఆ అంశం గురించి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కనీసం స్పందించడమే మానేశారు.