ఝార్ఖండ్‌ కొత్త సీఎంగా చంపయీ సోరెన్.. హేమంత్ సోరెన్ అరెస్ట్..

  • IndiaGlitz, [Thursday,February 01 2024]

లోక్‌సభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఇటీవల ఆయనను విచారిస్తు్న్నారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం రాంచీలోని హేమంత్ ఇంటికి చేరుకున్న అధికారులు దాదాపు 7 గంటలకు పైగా విచారించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున రాంచీకి చేరుకున్నారు. మరోవైపు గిరిజన సంఘాలు సోరెన్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి.

అరెస్టుకు ముందు ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. సీఎంగా అతని భార్య కల్పనా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని తోటి కోడలు సీతా సోరెన్ ఖండించారు. దీంతో హేమంత్ సొరేన్‌కు సన్నిహితుడైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి చంపయీ సోరెన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో ఎమ్మెల్యేలంతా రాజ్ భవన్‌కు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. వీలైనంత త్వరగా చంపయీ సోరెన్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని అభ్యర్థించారు.

చంపయీ సోరెన్ 1991 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సెరికెల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జేఎంఎం పార్టీ అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు గడించారు. ఇదిలా ఉంటే ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఈడీ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు హేమంత్‌ అరెస్ట్‌ను