18న చలో విజయవాడ
- IndiaGlitz, [Thursday,May 02 2019]
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ నెల 18న 'చలో విజయవాడ' అని అననుంది. ఇంతకీ తెలుగు ఇండస్ట్రీ ఆ రోజు ఎందుకు వెళ్లనుంది అనేగా అనుమానం. 'మహర్షి' సక్సెస్‌మీట్ కోసం. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పీవీపీ వెల్లడించారు. కేవలం సక్సెస్ మీట్ గురించి మాత్రమే కాదు, మహేశ్‌తో 'రాజకుమారుడు' నుంచి పనిచేసిన దర్శకనిర్మాతలు అందరినీ ఈ వేడుకకు పిలవనున్నారట.
ఆయనతో పనిచేసిన నాయికలను కూడా పిలిచే ఆలోచనల్లో ఉన్నట్టు వినికిడి. ఇందులో విశేషం ఏంటంటే, ఈ విషయం గురించి మహేష్‌కు కూడా తెలియకపోవడం. హీరో మహేష్‌కు ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పి సర్ప్రైజ్ చేశారు.
పీవీపీ చెప్పిన లెక్కన ఈ సినిమా సక్సెస్ మీట్‌కు పాతిక మంది నిర్మాతలు, పాతిక మంది దర్శకులు, ఆయనతో పనిచేసిన డ్యాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లు, సంగీత దర్శకులు ఇలా అందరూ విజయవాడ బాట పడితే 18న విజయవాడలో హోటల్ రూములన్నీ కిక్కిరిసి పోతాయేమో.