వృద్ధాశ్రమం కోసం రెడ్ ఎఫ్ ఎం స్ప్రెడ్ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్న ఛలో మూవీ యూనిట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ ఎఫ్ ఎం రేడియో రెడ్ ఎఫ్ ఎం ప్రతి ఏటా స్ప్రెడ్ స్మైల్ పేరుతో వృద్దాశ్రమం లోని వృద్ధుల్ని ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి కళ్ళల్లో ఆనందం నింపుతూ తమ జీవితాల్లో నవ్వులు నింపుతూ హృదయాల్ని దోచుకున్నారు. ఈ సంవత్సరం ఈ మహా కార్యక్రమంలో ఛలో చిత్ర యూనిట్ కూడా పాలు పంచుకుంది. తమ ఛలో చిత్రం తరపున 300 కిలోల బియ్యాన్ని అందించి తమ ఔదార్యం చాటుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిని మా కుటుంబ సభ్యులుగా భావించి చిన్న సాయం చేసాం. భవిష్యత్తులో ఎలాంటి సాయం చేయడానికి ఐనా మా ఐరా క్రియేషన్స్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాం. అని అన్నారు.
ఐరా క్రియేషన్స్ బ్యానర్లో నాగశౌర్య రష్మీక జంటగా వెంకీ దర్శకత్వంలో రూపొందుతున్న ఛలో చిత్రం ఫిబ్రవరి 2 న గ్రాండ్ గా రిలీస్ చేస్తున్నారు.
నటీనటులు - నాగశౌర్య, రష్మిక మండన్న, నరేష్, పోసాని, రఘు బాబు, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వేణు గోపాల రావు, మెట్ట రాజేంద్రన్, ప్రగతి, స్వప్ని, సుదర్శన్, జీవా తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com