వృద్ధాశ్రమం కోసం రెడ్ ఎఫ్ ఎం స్ప్రెడ్ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్న ఛలో మూవీ యూనిట్

  • IndiaGlitz, [Thursday,December 21 2017]

ప్రముఖ ఎఫ్ ఎం రేడియో రెడ్ ఎఫ్ ఎం ప్రతి ఏటా స్ప్రెడ్ స్మైల్ పేరుతో వృద్దాశ్రమం లోని వృద్ధుల్ని ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి కళ్ళల్లో ఆనందం నింపుతూ తమ జీవితాల్లో నవ్వులు నింపుతూ హృదయాల్ని దోచుకున్నారు. ఈ సంవత్సరం ఈ మహా కార్యక్రమంలో ఛలో చిత్ర యూనిట్ కూడా పాలు పంచుకుంది. తమ ఛలో చిత్రం తరపున 300 కిలోల బియ్యాన్ని అందించి తమ ఔదార్యం చాటుకున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిని మా కుటుంబ సభ్యులుగా భావించి చిన్న సాయం చేసాం. భవిష్యత్తులో ఎలాంటి సాయం చేయడానికి ఐనా మా ఐరా క్రియేషన్స్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాం. అని అన్నారు.

ఐరా క్రియేషన్స్ బ్యానర్లో నాగశౌర్య రష్మీక జంటగా వెంకీ దర్శకత్వంలో రూపొందుతున్న ఛలో చిత్రం ఫిబ్రవరి 2 న గ్రాండ్ గా రిలీస్ చేస్తున్నారు.

నటీనటులు - నాగశౌర్య, రష్మిక మండన్న, నరేష్, పోసాని, రఘు బాబు, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వేణు గోపాల రావు, మెట్ట రాజేంద్రన్, ప్రగతి, స్వప్ని, సుదర్శన్, జీవా తదితరులు

More News

'ఒక్క క్షణం' సెన్సార్ పూర్తి

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి జంట‌గా, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో , క్వాలిటి కోస‌మే ప‌రిత‌పించే లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ పై చక్రి చిగురుపాటి నిర్మించిన  చిత్రం ఒక్

వెంకటేష్.. రెండు రోజులు

విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రల్లో కనిపించిన సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.

'అనసూయ' కి 10 ఏళ్లు

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో రాణించిన కథానాయికల్లో భూమికా చావ్లా ఒకరు.

'కుమారి 21F' మళ్ళీ రిపీటవుతుందా ?

'కుమారి 21F' లాంటి యూత్ ఫుల్ & సెన్సేషనల్ హిట్ అనంతరం ఆ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, కథానాయకుడు రాజ్ తరుణ్ ల క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీటవ్వనుంది.

సినిమా చూశాను.. డెఫనెట్ గా సూపర్ హిట్ అవుతుంది - 'హలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి

యూత్ కింగ్ అఖిల్,కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో అన్నపూర్ణ స్టూడియోస్,'మనం'ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో '