నాగశౌర్య 'ఛలో' వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
నాగశౌర్య, రష్మిక మండన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `ఛలో`. తమిళనాడు, ఆంధ్ర బోర్డర్‌లో రెండు గ్రామాల మధ్య జరిగే ఓ గొడవ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఓ పక్క హీరో, మరో పక్క హీరోయిన్ ఉంటారు. ఇద్దరూ ప్రేమలో పడతారు. తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో ఏం చేశాడనేదే ఈ `ఛలో` సినిమా. వెంకీ కుడుమల దర్శకుడు.
ఈ సినిమాను డిసెంబర్ 28న విడుదల చేయాలని అనుకున్నారు కానీ..తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయట. వినపడుతున్న వార్తల ప్రకారం సినిమా ఫిబ్రవరిలో వాయిదా పడుతుందని అంటున్నారు.
త్వరలో దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments