'ఛలో' దర్శకుడితో ప్రముఖ నిర్మాణ సంస్థ?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ రంగంలోనైనా విజయానికి ఉండే స్థానం ప్రత్యేకమే. కాని ఆ విజయం తొలి అడుగులోనే వరిస్తే.. ఇక ఆ విజయం జీవితంలో ఎంతో మధురంగా ఉంటుంది. అటువంటి విజయాన్ని ఛలో` సినిమాతో అందుకున్నారు దర్శకుడు వెంకీ కుడుముల. యోగి, తేజ, త్రివిక్రమ్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో ఈ సినిమాని రూపొందించారు.
త్రివిక్రమ్ శిష్యుడు కావడంతో ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా మలిచి.. విజయం సాధించారు వెంకీ కుడుముల. ఇదిలా వుంటే...గతంలో అఆ` సినిమాని నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ దర్శకుడితో ఓ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ కథను నిర్మాతకు చెప్పినట్టు...తుది మెరుగులు దిద్దిన తర్వాత ఈ మూవీని పట్టాలెక్కించనున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటీనటులతో హై బడ్జెట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments