తెలంగాణలో వరుస దారుణాలు.. పోలీసులకు సవాల్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అబలలపై అఘాయిత్యాల ఎక్కువవుతున్నాయి. గత వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో నాలుగైదు దారుణ ఘటనలు వెలుగుచూడగా తాజాగా.. యాదాద్రి జిల్లా హాజీపూర్ మరో ఘటన చోటుచేసుకుంది. నెలరోజుల క్రితం అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. డెడ్ బాడీని నిశితంగా పరిశీలించిన పోలీసులు మనీషాగా గుర్తించారు. కాగా రెండ్రోజుల క్రితం శ్రావణి మృతదేహం లభించిన బావిలోనే మనీషా డెడ్‌బాడీ కూడా దొరికింది.
హాజీపూర్‌లో అసలేం జరుగుతోంది..?
హాజీపూర్ గ్రామంలో నాలుగేళ్లలో మూడు హత్యలు చోటుచేసుకున్నాయి. కల్పన, మనీషా, శ్రావణి హత్యకేసులు పోలీసులకు సవాల్‌గా మారాయి. నెలరోజుల క్రితం అదృశ్యమైన మనీష ఎంత వెతికినా కనిపించకపోవడంతో తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే సోమవారం నాడు మనీషా మృతదేహం బయటపడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు, ఎమ్మార్వో, ఆర్డీవో.. ఫైరింజన్ సాయంతో మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. వరుసగా ముగ్గురి యువతుల మృతదేహాలు ఒకే బావిలో లభించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఓ పాత నేరస్తుడితో పాటు ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గ్యాంగ్ ఏమైనా ఉందా..?
మొత్తానికి చూస్తే సినీ ఫక్కీలో వరుస ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇదంతా కాస్త లోతుగా గమనిస్తే దీని వెనుక ఏదో ఒక గ్యాంగ్ ఉందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ గ్యాంగ్‌లో హాజీపూర్‌కు సంబంధించిన వాళ్లే ఉన్నారా..? లేదా వేరే ఊర్ల నుంచి వచ్చినవాళ్లు ఉన్నారా..? అన్నది తెలియాల్సి ఉంది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి ఘటనలు ఆగేలా లేవు. సో... పోలీసు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగుచూస్తాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout