ఆడవాళ్ళపై నోరు జారిన చలపతిరావు
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు ఎన్నో సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సీనియర్ యాక్టర్ చలపతిరావును అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. సాధారణంగా చలపతిరావు అడల్ట్ జోక్స్ వేస్తుంటాడు. ఇది స్క్రీన్ వెనుక వరకు పరిమితమైతే బావుండేది. కానీ లైవ్‌లో అందరూ చూస్తుంటారు కదా అనే కనీస ఇంగితం కూడా మరచిపోయాడేమో కానీ ఆడవాళ్ళపై తనదైన రీతిలో నోరు పారేసుకున్నాడు ఈ సీనియర్ నటుడు. నిన్న జరిగిన రారండోయ్ ఆడియో వేడుకలో చలపతిరావు ఆడవాళ్ళపై నోరు పారేసుకున్నాడు.
ట్రైలర్లో ఆడవాళ్ళు మనశ్శాంతికి హానికరం అనే డైలాగ్పై చిన్నపాటి డిస్కషన్ జరిగింది. ఆడియో హోస్ట్ చేసిన రవి, గీతాభగత్ల్లో గీతా చలపతిరావు ఈ విషయంపై ఓపినియన్ అడిగితే, అమ్మాయిలు హానికరం కాదు కానీ, పక్కలోకి పనికొస్తారంటూ కామెంట్ చేయడంతో లేడీ యాంకర్ అవాక్కైంది. ఏం చెప్పాలో తెలియక వెళ్ళిపోయింది. అయితే ఎంతో సీనియర్ నటుడైన చలపతిరావు ఇలా అనడం పట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. ఆడవాళ్ళను గౌరవించాలని చెప్పే భారతీయ సంప్రదాయాన్ని చెప్పాల్సిన ఇటువంటి సీనియర్ పర్సనే ఇలా చెప్పడం తగదని, సాధారణంగా అడల్ట్ జోక్స్ వేసే చలపతిరావు కెమెరా ముందు అలా అనడం భావ్యం కాదని చాలా మంది అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com