వెబ్ సిరీస్‌గా చలం నవల ‘ మైదానం’
- IndiaGlitz, [Monday,July 13 2020]
వెండితెరకు సమానంగా డిజిటల్ మీడియాకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ కమ్రంలో పలు ఓటీటీ సంస్థలు, ఏటీటీ సంస్థలు రెడీ అవుతున్నాయి. వీటికి తగినంత కంటెంట్ దొరకడం లేదు. దీంతో డిజిటల్ మీడియాకు పెరుగుతున్నఆదరణను దృష్టిలో పెట్టుకుని సినీ రంగానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇక నిర్మాతలైతే ఓటీటీ కంటెంట్‌ను సినిమాల రూపంలో, వెబ్ సిరీస్‌ల రూపంలో జనరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు ఫేమస్ అయిన నవలలు త్వరలోనే వెబ్ సిరీస్‌ల రూపంలో ప్రాణం పోసుకోనున్నాయి.
ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ సీనియర్ రైటర్ మధుబాబు రాసిన ‘షాడో’ సిరీస్‌ను వెబ్ సిరీస్ రూపంలో తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో ప్రముఖ రచయిత చలం రాసిన ‘మైదానం’ నవలను వెబ్ సిరీస్‌గా తెరకెక్కించబోతున్నారట. ఇంతకూ చేయబోయేది ఎవరో కాదు..డైరెక్టర్ వేణు ఊడుగుల. ఈయన నిర్మాతగా మారి ‘మైదానం’ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నాడట. అంతా పూర్తయ్యాక మరిన్ని వివరాలను తెలియజేస్తానని ఆయన తెలిపారు.