గ్రామీణ నేపథ్యంలో..'ఛల్ మోహన్ రంగ'
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ`. కృష్ణ చైతన్య దర్శకుడు. నితిన్ సిల్వర్ జూబిలీ ఫిల్మ్ (25వ చిత్రం) అయిన ఈ సినిమాని తన అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్‌తో పాటు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. లై` ఫేమ్ మేఘా ఆకాష్ మరోసారి నితిన్ సరసన నటించింది. ఈ చిత్రంలో నిన్నటి తరం కథానాయిక లిజి ఒక కీలక పాత్ర పోషించారు. దాదాపు 27 సంవత్సరాల గ్యాప్ తరువాత ఆమె నటించిన తెలుగు చిత్రమిది.
ఇదిలా వుంటే.. తమన్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన రెండు పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమాని తెరకెక్కించారని తెలిసింది. రీసెంట్‌గా హైదరాబాద్ సారథి స్టుడియోలో భారీ స్థాయిలో విలేజ్ సెట్ వేసి చిత్రీకరణను పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం తాలుకు ఆడియో ఫంక్షన్‌ను త్వరలోనే చాలా వైవిధ్యంగా జరిపేటట్టు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments