గ్రామీణ నేపథ్యంలో..'ఛల్ మోహన్ రంగ'

  • IndiaGlitz, [Monday,March 05 2018]

నితిన్ కథానాయకుడిగా న‌టించిన‌ తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ'. కృష్ణ చైతన్య ద‌ర్శ‌కుడు. నితిన్ సిల్వర్ జూబిలీ ఫిల్మ్‌ (25వ చిత్రం) అయిన ఈ సినిమాని తన అభిమాన క‌థానాయ‌కుడు పవన్ కళ్యాణ్‌తో పాటు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. లై' ఫేమ్ మేఘా ఆకాష్ మరోసారి నితిన్ సరసన నటించింది. ఈ చిత్రంలో నిన్నటి తరం క‌థానాయిక‌ లిజి ఒక కీలక పాత్ర పోషించారు. దాదాపు 27 సంవత్సరాల గ్యాప్ త‌రువాత‌ ఆమె న‌టించిన తెలుగు చిత్ర‌మిది.

ఇదిలా వుంటే.. తమన్ సంగీత సార‌థ్యంలో ఇటీవల విడుదలైన రెండు పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమాని తెరకెక్కించారని తెలిసింది. రీసెంట్‌గా హైదరాబాద్ సారథి స్టుడియోలో భారీ స్థాయిలో విలేజ్‌ సెట్ వేసి చిత్రీకరణను పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం తాలుకు ఆడియో ఫంక్షన్‌ను త్వరలోనే చాలా వైవిధ్యంగా జరిపేటట్టు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

ఫొటోగ్రాఫర్ గా అవతారమెత్తిన అనుపమ

‘అఆ’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.

ఎన్టీఆర్ , త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం లో పూజా హెగ్డే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మాటల మాంత్రికుడు,దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో

'అనగనగా ఒక ఊళ్ళో' ఆడియో ఆవిష్కరణ

అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో చంద్రబాలాజీ ఫిలిమ్స్ పతాకంపై సాయికృష్ణ కె.వి.ని దర్శకుడిగా పరిచయం చేస్తూ

విజయ్ దేవరకొండతో నాని హీరోయిన్

'కృష్ణగాడి వీర ప్రేమగాధ'వంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ భామ మెహ్రీన్.

30 వసంతాల 'రుద్రవీణ'

'పదుగురి సౌఖ్యాన్ని మించిన పండగ లేదని చాటి చెప్పిన చిత్రం 'రుద్రవీణ'.