ఈ వారంలోనే 'ఛ‌ల్ మోహ‌న్ రంగ‌' ఫ‌స్ట్ సింగిల్‌

  • IndiaGlitz, [Wednesday,February 21 2018]

"పవన్ కళ్యాణ్ గారు నా ఆడియో ఫంక్షన్ కి వచ్చారు కాబట్టే నా 'ఇష్క్' సినిమా పెద్ద హిట్ అయ్యింది" అని చెప్పుకునే నితిన్‌కు... ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ నిర్మాణంలో సినిమా చేసే అవ‌కాశం ద‌క్కింది. ఆ చిత్ర‌మే 'ఛ‌ల్ మోహ‌న్ రంగ‌'. ఈ చిత్రాన్ని ప‌వ‌న్‌తో పాటు నితిన్ తండ్రి కూడా క‌లిసి నిర్మించ‌డం విశేషం. అంతేగాకుండా, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి కథను అందించారు.

నితిన్ మాటలను బట్టి చూస్తే.. ఆడియో ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ వస్తేనే సినిమా పెద్ద హిట్ అయితే, ఇక నిర్మిస్తే అది ఇంకెంత హిట్ అవుతుందోనని.. ఇటు నితిన్ అభిమానులతో పాటు, అటు పవన్ అభిమానులు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అదీగాక.. ఇది నితిన్ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ ఫిలిం (25వ సినిమా) కావడం విశేషం.

అలాగే.. 'భాగమతి', 'తొలిప్రేమ' సినిమాలతో సంగీతంపరంగా ఆకట్టుకున్న తమన్ ఈ సినిమాకి కూడా సంగీతం అందించడం ప్లస్ అనే చెప్పాలి. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను ఈ వారంలో విడుదల చేయనుంది చిత్ర బృందం. 'లై' ఫేమ్ మేఘా ఆకాష్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని 'రౌడీ ఫెలో' ఫేమ్‌ కృష్ణ చైతన్య తెరకెక్కించారు.వీరాభిమాని సినిమాని అభిమాన నటుడు తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో చూడాలంటే ఏప్రిల్ 5 వరకు వేచి ఉండాల్సిందే.

More News

ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌లో నంద‌మూరి త్ర‌యం?

సీనియర్ నటుడు హరికృష్ణ మళ్ళీ నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు. సుమారు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ హరికృష్ణ తెరపై కనిపించనున్నారు.

ఆ ఇద్ద‌రు మేటి న‌టులు.. మ‌రోసారి

ఒకరు ప‌రిపూర్ణ‌ నటుడు అయితే.. మరొకరు విలక్షణ నటుడు. వీరిద్దరూ కలిసి నటించి దాదాపు రెండు దశాబ్దాలపైనే అయింది. వారే మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్, విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్ రాజ్.

సమ్మర్ సందడికి సై అంటున్న రవితేజ

సినిమా అంటే వినోదం. అటువంటి వినోదాన్ని ప్రేక్షకులకు పంచడంలో ముందుంటారు మాస్ మహారాజ రవితేజ. ఆయ‌న న‌టించ‌గా.. ఇటీవల విడుదలైన 'టచ్ చేసి చూడు' బాక్సాఫీస్ వద్ద నిరాశ‌ప‌రిచింది.

'కాలా' టీజర్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే తమిళనాట పండుగ వాతావరణం నెలకొంటుంది. అందుకే ఆయన సినిమాలను భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు.

ఆగ‌ష్టు నుంచి రానా, గుణ‌శేఖ‌ర్ చిత్రం

చారిత్రాత్మ‌క చిత్రాల‌ను తెరకెక్కించ‌డంలో దర్శకుడు గుణశేఖర్ స్టైలే వేరు. ఈయన పేరు చెబితే 'ఒక్కడు' సినిమాలోని చార్మినార్ సెట్‌, 'అర్జున్' సినిమాలోని మధుర మీనాక్షి గుడి సెట్‌ కళ్ళ ముందు కదలాడతాయి.