36 ఇండ్యూజువల్ క్యారెక్టర్స్ తో 'చల్ చల్ గుర్రం'
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా సినిమాల్లోని పాత్రల మధ్య రిలేషన్స్ ఉంటాయి. కానీ చల్ చల్ గుర్రం సినిమాలో పాత్రల మధ్య రిలేషన్స్ ఉండవు. అలా రిలేషన్ లేని 36 పాత్రల మధ్య నడిచే కథే `చల్ చల్ గుర్రం` అని అన్నారు దర్శకుడు మోహన ప్రసాద్. ఎం.ఆర్.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ముకుంద ఫేమ్ శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనా రాయ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'చల్ చల్ గుర్రం'. మోహన ప్రసాద్ దర్శకత్వంలో రాఘవయ్య నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 28న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మోహన్ ప్రసాద్ మాట్ మాట్లాడుతూ 'చల్ చల్ గుర్రం' చిత్రాన్ని అక్టోబర్ 28న విడుదల చేస్తున్నాం. కొత్త కాన్సెప్ట్‌ను యంగ్‌టీంతో కలిసి చేశాం. టైటిల్‌కు అనుగుణంగానే సినిమా ఫన్ ఎంటర్‌టైనర్. నిర్మాత రాఘవయ్యగారు చేసిన సపోర్ట్‌తో సినిమా చక్కగా వచ్చింది. పలు ఇంటర్నేషనల్ కార్ రేసింగ్స్‌లో పాల్గొన్న హీరో శైలేష్ ముకుంద సినిమా తర్వాత చేసిన చిత్రమిది. అద్భుతంగా నటించారు. అలాగే హీరోయిన్స్ అంగనా రాయ్, దీక్షాపంత్‌లు చక్కగా యాక్ట్ చేశారని అన్నారు. ముకుంద తర్వాత బిజినెస్ వ్యవహారాల్లో బిజీ అయిపోయాను. అయితే దర్శకుడు మోహనప్రసాద్‌గారు, నిర్మాత రాఘవయ్యగారు వచ్చి నన్ను కలిసి ఈ కథను చెప్పారు. కథ నచ్చడంతో సినిమాలో నటించడానికి అంగీకరించాను. మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ. సినిమా చాలా బాగా వచ్చింది. అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ నెల 28న సినిమా విడుదలవుతుంది. సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నానని హీరో శైలేష్ బొలిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ వెంగీ, సినిమాటోగ్రాఫర్ వి.శ్యామ్‌ప్రసాద్, హీరోయిన్స్ దీక్షాపంత్, అంగనారాయ్‌లు పాల్గొని అక్టోబర్ 28న విడుదలవుతున్న 'చల్ చల్ గుర్రం' సినిమాను పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరారు.
నాగబాబు, బెనర్జీ, ముక్తర్ ఖాన్, ప్రవీణ్, సుడిగాలి సుధీర్, చిత్రం శ్రీను, అశోక్‌కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: శంకర్, సినిమాటోగ్రఫీ: వి.శ్యామ్ ప్రసాద్, ఆర్ట్: జె.కె.మూర్తి, మ్యూజిక్: వెంగీ, ఫైట్స్: రామ్ సుంకర, ప్రొడ్యూసర్: రాఘవయ్య, స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మోహనప్రసాద్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments