చైతు మూడో హీరోయిన్ ఓకే అయింది...
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ తరం అక్కినేని హీరోల్లో పెద్దోడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్న సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. మలయాళంలో పెద్ద హిట్ అయిన ప్రేమమ్` సినిమాకు రీమేక్ ఇది. కార్తికేయ` సినిమాతో తానేంటో నిరూపించుకున్న చందుమొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను ఎస్.రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ముందు మజ్ను` అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రేమమ్` అనే టైటిల్ నే పెట్టాలని చూస్తున్నారట. ఈ చిత్రంలోని ముగ్గురు హీరోయిన్స్ శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ ఓకే అయ్యారు. మూడో హీరోయిన్ గా చాలా మంది పేర్లు వినిపించినా ఇప్పుడు మలయాళ ప్రేమమ్` లో నటించిన మడోన్నా సెబాస్టియన్ నే దర్శక నిర్మాతలు ఓకే చేశారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com