నాలుగోసారి కలసి నటిస్తున్నయువ జంట..
Send us your feedback to audioarticles@vaarta.com
నాలుగోసారి కలసి నటిస్తున్న యువ జంట..ఎవరో కాదు నాగ చైతన్య - సమంత. వీరిద్దరు తొలిసారి ఏమాయ చేసావే చిత్రంలో కలిసి నటించారు. ఆతర్వాత మనం, ఆటోనగర్ సూర్య చిత్రాల్లో నటించారు. తాజాగా నాలుగోసారి చైతన్య - సమంత కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి మ్యూజిక్ అందించనున్నట్టు సమాచారం.
ఇటీవల ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించారు. ఈ చిత్రం షూటింగ్ ని జూన్ నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. నాలుగోసారి కలిసి నటిస్తున్న ఈ హిట్ పెయిర్ చైతు - సమంత ఈసారి ఎలా మాయ చేస్తారో..? ఎలాంటి పాత్రలతో ఆకట్టుకుంటారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments