చైతు సినిమా రెడీ
Send us your feedback to audioarticles@vaarta.com
యువ సమ్రాట్ నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఏమాయ చేసావే సినిమా తర్వాత చైతు, గౌతమ్ కలసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల చైతన్య, మంజిమ మోహన్ లపై టర్కీలో ఓ పాట చిత్రీకరించారు. ప్రస్తుతం చెన్నైలో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
ఈ సినిమా తెలుగు వెర్షెన్ లో చైతన్య హీరోగా నటిస్తుండగా.. తమిళ్ లో హీరోగా శింబు నటిస్తున్నాడు. అయితే...తెలుగు, తమిళ్ ఈ రెండింటిలో మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న సాహసం శ్వాసగా సాగిపో ఆడియోను ఈనెల 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మే 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com