హీరో చైతన్య రావు-డైరక్టర్ చందు ముద్దు- నిర్మాత యశ్ రంగినేని కలయికలో కొత్త చిత్రం

  • IndiaGlitz, [Wednesday,March 09 2022]

పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, ఏబీసీడీ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న బిగ్ బెన్ సినిమాస్, భారత జాతీయ అవార్డు గ్రహింపుతో మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. కొత్త తరహా చిత్రాలతో, కొత్త దర్శకులకు అవకాశమిస్తూ సినిమా మీద తనకున్న ప్యాషన్ చూపిస్తున్నారు నిర్మాత యశ్ రంగినేని.

ప్రస్తుతం శ్రీసింహా కోడూరి హీరోగా భాగ్ సాలే అనే చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సంస్థ మరో కొత్త చిత్రాన్ని
నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇది బిగ్ బెన్ సినిమాస్ సోలో ప్రాజెక్ట్ గా నిర్మితం కానుంది.

ఈ చిత్రంలో 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావ్ మాధాడి హీరోగా ఓ పిట్ట కథ చిత్ర దర్శకుడు చెందు ముద్దు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా ఒక విల్లేజ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందనుంది . త్వరలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.

ఈ సినిమాలో నటించే నటీనటులు మరియు మిగతా సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాత తెలిపారు.

More News

విశ్వక్ సేన్ కొత్త సినిమా ‘‘దాస్ కా ధమ్కీ’’.. పాగల్ కాంబినేషన్ రిపీట్

'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్ ప్రస్తుతం..

ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ నిర్మాణంలో విజయ్ ఆంటోనీ హీరోగా 'హత్య'

డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా 'హత్య

నిరుద్యోగులకు తీపికబురు.. ఇవాళే 80,039 పోస్టులకు నోటిఫికేషన్, అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన

నిన్నటి వనపర్తి సభలో చెప్పినట్లుగానే .. ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఫలించని రెస్క్యూ ఆపరేషన్ .. సింగరేణిలో విషాదం, గనిలో చిక్కుకున్న ముగ్గురూ మృతి

పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి భూగర్భ గనిలో పైకప్పు కూలిన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో గనిలో చిక్కుకుపోయిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కాసులు కురిపించిన సమ్మక్క-సారక్క జాతర.. హుండీ ద్వారా ఎంత ఆదాయమంటే..?

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన ‘‘సమ్మక్క సారక్క జాతర’’ విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన