హీరో చైతన్య రావు-డైరక్టర్ చందు ముద్దు- నిర్మాత యశ్ రంగినేని కలయికలో కొత్త చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లి చూపులు", "డియర్ కామ్రేడ్", "దొరసాని", "ఏబీసీడీ" వంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న బిగ్ బెన్ సినిమాస్, భారత జాతీయ అవార్డు గ్రహింపుతో మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. కొత్త తరహా చిత్రాలతో, కొత్త దర్శకులకు అవకాశమిస్తూ సినిమా మీద తనకున్న ప్యాషన్ చూపిస్తున్నారు నిర్మాత యశ్ రంగినేని.
ప్రస్తుతం శ్రీసింహా కోడూరి హీరోగా "భాగ్ సాలే" అనే చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సంస్థ మరో కొత్త చిత్రాన్ని
నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇది బిగ్ బెన్ సినిమాస్ సోలో ప్రాజెక్ట్ గా నిర్మితం కానుంది.
ఈ చిత్రంలో "30 వెడ్స్ 21" ఫేమ్ చైతన్య రావ్ మాధాడి హీరోగా "ఓ పిట్ట కథ" చిత్ర దర్శకుడు చెందు ముద్దు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా ఒక విల్లేజ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందనుంది . త్వరలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.
ఈ సినిమాలో నటించే నటీనటులు మరియు మిగతా సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాత తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com