చైతు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న మంజిమా మోహ‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం పాట‌లు మిన‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. నాగ చైత‌న్య న‌టిస్తున్న మ‌రో చిత్రం ప్రేమ‌మ్ కూడా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

చందు మొండేటి తెర‌కెక్కిస్తున్న ప్రేమ‌మ్ కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ రెండు చిత్రాల్లో ముందుగా సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం...సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాన్ని తెలుగు - త‌మిళ్ లో ఒకేసారి మే 27న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఏమాయ చేసావే త‌ర్వాత చైతు - గౌత‌మ్ మీన‌న్ కాంబినేష‌న్లో రూపొందిన ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ సాహ‌సం శ్వాస‌గా సాగిపో పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి..చైతు అంచ‌నాలను అందుకుంటాడ‌ని ఆశిద్దాం.

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సావిత్రి'

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు.

బాలీవుడ్ లో ఊపిరి

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించారు. పి.వి.పి సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఊపిరి చిత్రాన్ని నిర్మించింది.

ముంబాయిలో స‌ర్ధార్ ఆడియో 

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ లో 800 ధియేట‌ర్స్ లో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ అవుతుండ‌డం విశేషం.

బంధాలు - బంధుత్వాల ప్రాముఖ్య‌త తెలియ‌చెప్పే మ‌నంద‌రి క‌థ ఊపిరి - డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి

మున్నా, బృందావ‌నం, ఎవ‌డు..చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి తాజా చిత్రం ఊపిరి. టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన ఊపిరి చిత్రాన్ని పి.వి.వి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది.

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నూతన చిత్రం

స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకొని... కథానాయకుడిగా వరుస విజయాలు అందుకుంటున్న సునీల్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.