చైతన్య - కళ్యాణ్ కృష్ణ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమమ్ తో సక్సెస్ సాధించిన అక్కినేని నాగచైతన్య తదుపరి చిత్రాన్ని సోగ్గాడు చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ తో చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. జగపతిబాబు ఓ కీలక పాత్రను పోషిస్తుండడం విశేషం.
ఇక ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే....నవంబర్ 18 నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నాగార్జునకు కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సంచలన చిత్రం సోగ్గాడే చిన్ని నాయానా అందించారు. మరి...చైతన్యకి కూడా కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీని అందిస్తారని ఆశిద్దాం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com