చైత‌న్య - క‌ళ్యాణ్ కృష్ణ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

  • IndiaGlitz, [Monday,October 10 2016]

ప్రేమ‌మ్ తో స‌క్సెస్ సాధించిన అక్కినేని నాగ‌చైత‌న్య త‌దుప‌రి చిత్రాన్ని సోగ్గాడు చిన్ని నాయ‌నా ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణ తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌డం విశేషం.

ఇక ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే....న‌వంబ‌ర్ 18 నుంచి హైద‌రాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి చైత‌న్య‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, జ‌గ‌ప‌తిబాబు ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటారని స‌మాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ నాగార్జున‌కు కెరీర్ లో హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన సంచ‌ల‌న చిత్రం సోగ్గాడే చిన్ని నాయానా అందించారు. మ‌రి...చైత‌న్య‌కి కూడా కెరీర్ లో హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ సాధించే మూవీని అందిస్తారని ఆశిద్దాం..!