చైతన్య డిజిటల్ ఎంట్రీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య హీరోగా సాయిపల్లవితో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన ‘లవ్‌స్టోరి’ ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు చైతన్య. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న చైతన్య డిజిటల్ మాధ్యమంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ట్రెండ్‌కు అనుగుణంగా, డిజిటల్ మీడియా ఎక్కువైంది. ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సంస్థలు నిర్మిస్తోన్న వెబ్ సిరీస్‌లను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వెండితెర స్టార్స్ అందరూ డిజిటల్ మీడియా వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే చాలా మంది టాప్ టెక్నీషియన్స్, స్టార్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. వీరి బాటలో హీరో నాగచైతన్య కూడా చేరబోతున్నాడట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు దర్శకుడు విక్రమ్ కుమార్, చైతన్యతో ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశాడట. వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తుందని అంటున్నారు. ఇప్పటికే చైతన్య సతీమణి, స్టార్ హీరోయిన్ డిజిటల్ మాధ్యమంలోకి అడుగు పెట్టేసింది. సామ్‌జామ్ షోతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోయే ది ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్‌లో నటించింది. మరి చైతన్య డిజిటల్ ఎంట్రీ వార్తల్లో నిజానిజాలు ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments