మాజీ కపుల్స్ అమీర్ ఖాన్, కిరణ్ రావుతో నాగ చైతన్య.. లుక్ అదిరింది!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో చైతు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆర్మీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగ చైతన్య, అమీర్ ఖాన్ ఇద్దరూ ఆర్మీ అధికారులుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో ఇద్దరూ స్నేహితులుగా కనిపిస్తారట. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ లడాఖ్ లో తిరిగి ప్రారంభం అయింది. నాగ చైతన్య కూడా షూట్ లో జాయిన్ అయ్యాడు. తాజాగా చైతు సోషల్ మీడియాలో లాల్ సాంగ్ చద్దా లొకేషన్ నుంచి మెమొరబుల్ పిక్ పోస్ట్ చేశాడు. ఈ పిక్ లో మాజీ కపుల్స్ అమీర్ ఖాన్, కిరణ్ రావు లతో చైతు ఉండడం విశేషం.
ఇటీవలే అమీర్ ఖాన్, కిరణ్ రావులు విడాకులతో విడిపోయారు. కానీ వర్క్ పరంగా తామిద్దరి భాగస్వాయం కొనసాగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కిరణ్ రావు కూడా అసోసియేట్ అయి ఉంది. ఈ ఫోటోలోనే చిత్ర దర్శకుడు అద్వైత్ చందన్ ని కూడా చూడవచ్చు.
నాగ చైతన్య.. అమిర్ ఖాన్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోనుండడంతో ఆసక్తి నెలకొంది. 20 రోజుల్లోనే చైతు పాత్ర చిత్రీకరణ పూర్తి కానుందట. మొదట ఈ పాత్ర కోసం తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో నాగ చైతన్యని అప్రోచ్ కావడం జరిగింది.
కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అమిర్ ఖాన్, ప్రొడక్షన్స్ వైకాం 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019లో ప్రారంభమైన ఈ చిత్రం ఇండియాలోని 100 లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది. కరోనా వల్ల పలుమార్లు షూటింగ్ వాయిదా పడింది. ఫారెస్ట్ గంప్ అనే చిత్రం ఆధారంగా దర్శకుడు అద్వైత్ ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com