చైతు - అఖిల్ సినిమాల‌పై మ‌న‌సు పెట్ట‌లేద‌న్న నాగ్..

  • IndiaGlitz, [Thursday,April 14 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున మ‌నం, సోగ్గాడే చిన్నినాయ‌నా, ఊపిరి చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఊపిరి చిత్రానికి ఘ‌న విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కాభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేసేందుకు థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసి త‌న సంతోషాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతూ...ఇప్ప‌టి వ‌ర‌కు చైత‌న్య - అఖిల్ సినిమాల పై నేను మ‌న‌సు పెట్ట‌లేదు. ఇక నుంచి చైత‌న్య - అఖిల్ సినిమాల గురించి ఆలోచిస్తాను. నాగ చైత‌న్య హీరోగా సోగ్గాడే చిన్నినాయానా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నాను. అలాగే అఖిల్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే చిత్రానికి సంబంధించి క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ రెండు నెల‌లు ఈ రెండు సినిమాల ప‌నుల్లోనే ఉంటాను. ఆత‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావు గారితో వెంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుడు హ‌తిరామ్ బాబా క‌థ‌తో సినిమా చేస్తున్నాను అని చెప్పారు. మ‌రి..నాగ్ మ‌న‌సు పెట్టిన త‌ర్వాత అయినా చైతు - అఖిల్ సినిమాలు స‌క్సెస్ సాధిస్తాయ‌ని ఆశిద్దాం.

More News

హీరో విష్ణు కి కోపం వ‌చ్చింది..

మంచు విష్ణు - రాజ్ త‌రుణ్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం ఈడోర‌కం - ఆడోర‌కం. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కించిన ఈడోర‌కం - ఆడోర‌కం చిత్రం ఈరోజు రిలీజైంది.

మనోభావాలను గౌరవించి విజయ్ పోలీసోడు టైటిల్ మార్పు

ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రానికి  తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ ను అనుకున్న విషయం తెలిసిందే. తేరి చిత్రానికి పోలీసోడు అనే టైటిల్ ను పెడితే బాగుంటుంది అని నిర్ణయించింది నిర్మాత  కలయిపులి ఎస్ థాను. దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని తెలుగు లో కేవలం విడుదల మాత్రమే చేస్తున్నారు.

మ‌హేష్ ఫ్యాన్స్ ని టెన్ష‌న్ పెడుతున్న సెంటిమెంట్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.

పోలీసోడు ర‌న్ టైమ్..

త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన తెరి చిత్రం తెలుగులో పోలీసోడు టైటిల్ తో రిలీజ్ అవుతుంది. విజ‌య్ స‌ర‌స‌న స‌మంత‌, అమీ జాక్స‌న్ న‌టించారు. అట్లీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

నాగ్ కెరీర్ లో ఊపిరి ఆల్ టైమ్ రికార్డ్

మనం,సోగ్గాడే చిన్ని నాయనా,ఊపిరి...ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.