ఆడియో రిలీజ్ కి రెడీ అవుతున్న చైతు సినిమా..
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రాన్ని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య సరసన మలయాళ ముద్దుగుమ్మ మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాగ చైతన్య కి ఏమాయ చేసావే తో సూపర్ హిట్ అందించిన గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 90% షూటింగ్ పూర్తి చేసుకుంది.
తెలుగు వెర్షన్ లో హీరోగా చైతన్య నటిస్తుంటే...తమిళ్ లో హీరోగా శింబు నటిస్తున్నాడు. ఇప్పటికే తమిళ్ వెర్షన్ సాంగ్ తల్లి పోగాధే సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఈ సినిమా ఆడియో పై మరింత క్రేజ్ ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం ఆడియోను ఫిబ్రవరిలో రిలీజ్ చేసి, సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments