ఆడియో రిలీజ్ కి రెడీ అవుతున్న చైతు సినిమా..

  • IndiaGlitz, [Friday,January 22 2016]

నాగ చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం సాహసం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రాన్ని గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ తెలుగు, త‌మిళ్ లో తెర‌కెక్కిస్తున్నారు. నాగ చైత‌న్య స‌ర‌స‌న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మంజిమ మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాగ చైత‌న్య కి ఏమాయ చేసావే తో సూప‌ర్ హిట్ అందించిన గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దాదాపు 90% షూటింగ్ పూర్తి చేసుకుంది.

తెలుగు వెర్ష‌న్ లో హీరోగా చైత‌న్య న‌టిస్తుంటే...త‌మిళ్ లో హీరోగా శింబు న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే త‌మిళ్ వెర్ష‌న్ సాంగ్ త‌ల్లి పోగాధే సాంగ్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఈ సినిమా ఆడియో పై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆడియోను ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేసి, సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

కోలీవుడ్ కెప్టెన్ రాజీనామా

తారల క్రికెట్ కు ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది.బాలీవుడ్,టాలీవుడ్,శాండిల్ వుడ్,కోలీవుడ్,మాలీవుడ్ ఇలా అందరూ తారలు కలిసి క్రికెట్ ఆడుతున్నారు.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజ్ డేట్‌..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ప‌వ‌ర్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.

కిల్లింగ్ వీరప్పన్ కి బంపర్ ఆఫర్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం కి్లింగ్ వీరప్పన్.

స‌రైనోడు ఫ‌స్ట్ లుక్ డేట్ ఫిక్స్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

అందుకే బాల‌య్య‌తో అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా డిక్టేట‌ర్ తీసాను - డైరెక్ట‌ర్ శ్రీవాస్

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ హీరోగా న‌టించిన తాజా చిత్రం డిక్టేట‌ర్ ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్  శ్రీవాస్ తెర‌కెక్కించారు.