Chadrababu: 150 సీట్లలో అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలవదు.. చంద్రబాబు ఎద్దేవా
Send us your feedback to audioarticles@vaarta.com
మూడు నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల సీఎం జగన్ 11 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను మార్చడంపై చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. 151 సీట్లలో అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలవదని ఎద్దేవా చేశారు. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలనే ట్రాన్స్ఫర్లు చేశారంటే ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చన్నారు. ఓ చోట చెల్లని కాసు.. మరో చోట ఎలా చెల్లుబాటు అవుతుంది? అని ఇంఛార్జిల మార్పులపై సెటైర్లు వేశారు.
దళితులు, బీసీలనే బదిలీ చేస్తూ బలిపశువులను చేస్తు్న్నారని చంద్రబాబు మండిపడ్డారు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. పులివెందులలో బీసీలను నిలబెట్టి జగన్ వేరే చోట పోటీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ఎస్సీ, బీసీ నేతలను బదిలీలు చేసిన జగన్.. తన సామాజికవర్గం నేతలైన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదు అని నిలదీశారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలు వర్సెస్ సైకో జగన్ అనే నినాదంతో జరగనున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని.. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మరింత మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు.
అందరి అభిప్రాయాలతోనే తమ పార్టీ అభ్యర్ధులను నిలబెడతామన్నారు. వైసీపీ అభ్యర్ధులకు తాడేపల్లి ఆమోదం.. టీడీపీ అభ్యర్థులకు ప్రజామోదం అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అందరూ సహకరించాలని, మార్పునకు నాంది పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంగన్వాడీల న్యాయపోరాటానికి అండగా ఉంటామన్నారు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. వైసీపీ నేతల లెక్కలు మొత్తం తారుమారు అయ్యాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఇక తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం సంభవించిందని.. 15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. తుఫాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. పంట నష్టాన్ని నివారించే పరిస్థితులున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పట్టిసీమ నీటిని విడుదల చేసి ఉంటే పంట ముందుగానే చేతికి వచ్చేదన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపానుల బారి నుంచి పంటలు కాపాడుకునేవాళ్లమన్నారు. తాను పట్టిసీమ కట్టాననే కారణంతో సైకో జగన్ నీటిని విడుదల చేయలేదని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com