'చావు కబురు చల్లగా' షూటింగ్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి సమర్పణలో పిల్లా , భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సివాలా, ప్రతిరోజు పండగే లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన జిఏ2 బ్యానర్ పై మరో సన్సేషనల్ చిత్రానికి శ్రీకారం చుట్టారు యంగ్ ఇంటిలిజెంట్ ప్రోడ్యూసర్ బన్నివాసు. ఆర్.ఎక్స్ 100 సినిమాతో నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ హీరోగా , లక్కిబ్యూటి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కౌశిక్ పెగళ్లపాటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం చావుకబురు చల్లగా..
ఈరోజు ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో పూజాకార్యక్రమాలతో ఈ చిత్ర షూటింగ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ గారి మనమరాలు బేబి అన్విత క్లాప్ నివ్వగా , స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి మెదటి దర్శకత్వ భాద్యతని అల్లు అరవింద్ గారు నిర్వహించారు. ఈ చిత్రం లో హీరో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.. అలాగే ప్రముఖ కెమెరామెన్ సునిల్ రెడ్డి తన సినిమాటొగ్రఫి ని అందిస్తున్నారు, ఎడిటర్ గా సత్య, ప్రోడక్షన్ డిజైనర్ మనీషా ఏ దత్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ గా రాఘవ కరుటూరి లు బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈనెల 19 నుండి ఈ చిత్రం షూటింగ్ జరుకుంటుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు..
ఈ చిత్రంలో నటీనటులు.. కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు నటిస్తున్నారు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com