ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ‘‘Z’’ కేటగిరీ భద్రత... కేంద్రం కీలక నిర్ణయం

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్‌‌కు తక్షణమే సీఆర్పీఎఫ్‌ బలగాలతో ‘జడ్‌’ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. 22 మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక ఎస్కార్ట్‌ వాహనాన్ని కేటాయించనుంది కేంద్రం. వీరిలో నలుగురి నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉంటారు.

కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా మీరట్ జిల్లా కిట్టోర్‌లో జరిగిన ప్రచారానికి వెళ్లారు అసదుద్దీన్‌ ఒవైసీ. ప్రచారం ముగించుకుని అనంతరం ఢిల్లీ వెళ్తుండగా.. హాపుర్‌-గాజీయాబాద్‌ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్‌గేటు వద్ద గురువారం సాయంత్రం ఆయన కాన్వాయ్‌పై దుండుగులు మూడు నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటన నుంచి అసదుద్దీన్ తృటిలో తప్పించుకున్నారు. కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

ఢిల్లీకి చేరుకున్న అనంతరం అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. తనపై పెద్ద కుట్ర జరిగిందని, అల్లా దయవల్ల బయటపడ్డానని చెప్పారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పీకర్ ఓంబిర్లాను కలిసి ఫిర్యాదు చేస్తానని అసదుద్దీన్ తెలిపారు. యూపీలో మరో వారంలో తొలి విడత ఎన్నికల పోలింగ్‌ జరగనున్న సమయంలో అసదుద్దీన్‌పై కాల్పుల జరగడం అక్కడి రాజకీయాలను వేడెక్కించింది.

More News

రాజశేఖర్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కి ట్రీట్: 'శేఖర్' నుంచి కిన్నెర సాంగ్ విడుదల

కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసి.. ముఖంపై చెరగని చిరునవ్వుతో అందరి అభిమానాలను చొరగొంటున్నారు యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్. మూడున్నర దశాబ్ధాలకు

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : నందమూరి బాలకృష్ణ సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి

'అంటే సుందరానికి'... ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన నాని

కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ సినిమాలన్నీ ఒకదాని వెంట ఒకటి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి మే వరకు భారీ , మధ్యతరహా, చిన్న సినిమాల విడుదలతో బాక్సాఫీస్ కళకళలాడనుంది.

బండ్ల గణేష్ కూతురు చేతుల మీదుగా విడుదలైన 'డేగల బాబ్జీ' లోని "కలలే కన్నానే.." లిరికల్ వీడియో

ఒక వ్యక్తి, ఒకే ప్లేస్లో ఒకే లొకేషన్లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు.తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇది. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా. అయితే,

కాజల్‌కు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ

సినీ నటి కాజల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అత్యంత అరుదుగా, కొందరు ప్రముఖులకు మాత్రమే ఇచ్చే గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం కాజల్ అగర్వాల్‌కు అందజేసింది. దీనిపై ఆమె స్పందిస్తూ..