అమెరికా, చైనాలో కోవిడ్ విజృంభణ : భారత్ అప్రమత్తం.. నిర్లక్ష్యం వద్దు , రాష్ట్రాలకు హెచ్చరికలు

  • IndiaGlitz, [Wednesday,December 21 2022]

చైనాలో కరోనా స్వైర విహారం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. జీరో కోవిడ్ విధానం ద్వారా వైరస్‌ను అదుపులోకి తెచ్చిన డ్రాగన్ కంట్రీ.. ఇప్పుడు ఆ విధానాన్ని పక్కనబెట్టడంతో వణికిపోతోంది. కోవిడ్ రోగులతో ఆసుపత్రులు, మరణించిన వారితో మార్చురీలు, శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే వచ్చే మూడు నెలల కాలంలో 60 శాతం చైనా జనాభా, 10 శాతం ప్రపంచ జనాభా కోవిడ్ బారినపడే అవకాశాలు వున్నాయని అమెరికా శాస్త్రవేత్త ఒకరు హెచ్చరించారు. ప్రస్తుతం చైనాను కుదిపేస్తున్న ఈ మహమ్మారి మళ్లీ ప్రపంచంవైపు దూసుకొస్తుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా... భారత్‌లో మంగళవారం 112 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 3,490గా వుంది.

కొత్త వేరియంట్లను ఇలా ట్రాక్ చేయండి :

ఇదిలావుండగా చైనా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ వుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. కోవిడ్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని.. ఏమాత్రం నిర్లక్ష్యంగా వున్నా కేసులు పెరుగుతాయని హెచ్చరించింది. పాజిటివ్‌గా తేలిన వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. కొత్త వేరియంట్లను ఇన్సకాగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ట్రాక్‌ చేసేందుకు పాజిటివ్‌ కేసుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తద్వారా సరైన సమయంలో కొత్త వేరియంట్లను గుర్తించగలగడంతో పాటు దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతామన్నారు.

2019లో వుహాన్‌లో పుట్టిన కరోనా :

కోవిడ్‌ వైరస్‌ను తొలిసారిగా 1960లలో కనుగొన్నారు. అయితే 2019 డిసెంబర్ 1న మళ్లీ చైనాలోని వుహాన్‌లో దీని జాడను కనుగొన్నారు. అక్కడి మాంసం మార్కెట్ల నుంచి ఇది మనుషులకు సోకిందని ప్రపంచం నమ్ముతోంది. 2020 మార్చి నాటికి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలకు విస్తరించి.. లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. భారత్ సహా పలు దేశాలు కఠినమైన లాక్‌డౌన్ అమలు చేయడంతో పాటు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి .. వైరస్‌ను కంట్రోల్ చేశాయి. మళ్లీ ఇప్పుడు చైనాలో కోవిడ్ కరాళ నృత్యం నేపథ్యంలో ప్రపంచ భయాందోళనలకు గురవుతోంది.

More News

TTD EO Dharmareddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి.. వచ్చే నెలలో పెళ్లి, అంతలోనే

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి (28) కన్నుమూశారు.

KTR: డ్రగ్స్ టెస్ట్ కోసం కిడ్నీ, బ్లడ్ కూడా ఇస్తా.. నువ్వు చెప్పు దెబ్బలకు సిద్ధమా: బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్

తాను డ్రగ్స్‌కు బానిసనంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. తాను డ్రగ్స్ టెస్ట్‌కు రెడీ అని ప్రకటించారు.

టాలీవుడ్‌లో విషాదం : అలనాటి నటుడు హరనాథ్ కుమార్తె పద్మజారాజు హఠాన్మరణం .. ఆ కల తీరకుండానే

అలనాటి అందాల నటుడు హరనాథ్ కుమార్తె , ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు హఠాన్మరణం చెందారు.

Comedian Ali : అలీ - చిరంజీవిల తొలి సినిమా ఒకటే..  అసలేం జరిగిందంటే..?

అలీ ఈ పేరు వినగానే.. సొట్టబుగ్గల రూపం, ఎవరికీ అర్ధం కానీ భాషలో వింత శబ్ధాలతో చేసే కామెడీ గుర్తొస్తూ వుంటుంది.

Ram Charan : జీబ్రా చారల చొక్కాలో స్టైలిష్‌గా రామ్‌చరణ్.. షర్ట్ ఖరీదు అక్షరాలా..!!

రామ్‌చరణ్ తేజ్... ఈ పేరు తెలియని వారుండరు.