ఆసుపత్రులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

  • IndiaGlitz, [Sunday,May 09 2021]

భారత్‌లో కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. లక్షల్లో జనం కొవిడ్ బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రులు సైతం చేతులెత్తేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. కరోనా బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకోడానికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బాధితుల వద్ద కరోనా పాజిటివ్ ధృవపత్రం లేకున్నా ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. లక్షణాలు కనిపిస్తే ధృవీకరణ పత్రంతో సంబంధం లేకుండా కరోనా అనుమానిత కేసులుగా పరిగణించి ఆసుపత్రిలో చేర్చుకుని తక్షణమే వైద్యం అందించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు.. వ్యక్తిలోని కొవిడ్ స్థాయిని బట్టి కోవిడ్ కేర్ సెంటర్, డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్, డెడికేటెడ్ కోవిడ్ ఆస్పత్రులలో చేర్చుకుని వెంటనే చికిత్స అందించాలని సూచించింది.
ఏదో ఒక కారణం చెప్పి రోగికి వైద్యసేవలు నిరాకరించడానికి ఇకపై వీల్లేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వేరే నగరానికి చెందిన రోగైనా ఆక్సిజన్, అత్యవసర మందులు అందించాలని ఆసుపత్రులకు సూచించింది. రోగి స్థానిక గుర్తింపు కార్డు చూపించలేదన్న కారణంతో ఆస్పత్రిలో చేర్చుకోకుండా ఉండేందుకు వీల్లేదని వైద్య ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది.

అవసరం, ప్రాతిపదిక ఆధారంగా మాత్రమే ఆస్పత్రిలో ప్రవేశం కల్పించాలని సూచించింది. ఈ క్రమంలోనే అనవసరమైన వారితో పడకలను నింపేయవద్దని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త పాలసీకి అనుగుణంగా రోగులను డిశ్చార్జ్ చేయాలని ఆస్పత్రులకు సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మూడు రోజులలోపు స్థానిక ఆస్పత్రులకు ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కోవిడ్ కేర్ సెంటర్‌లను వీలైనన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రులను సైతం కొవిడ్ డెడికేటెడ్ ఆసుపత్రులుగా వినియోగించుకోవచ్చని సూచించింది.

More News

తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడి‌గా వల్లభనేని అనిల్ ఎన్నిక

తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి.

బన్నీకి గ్రీటింగ్ పంపించిన చెర్రీ దంపతులు

కరోనా మహమ్మారి భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంది.

బతుకుతాననే ఆశ లేదంటూ పోస్టు పెట్టిన కాసేపటికే నటుడి మృతి..

కరోనా మహమ్మారి జన జీవితాలను ఎంత విచ్ఛిన్నం చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఎన్నో సంఘటనలను చూస్తూనే ఉన్నాం.

`సింగ‌రాయ్` చిత్రంలోని సాయి ప‌ల్ల‌వి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్

క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో రూపొందుతోన్న నేచుర‌ల్‌స్టార్ నాని `శ్యామ్‌సింగ‌రాయ్` ఇటీవ‌లి కాలంలో ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి.

ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. చైనా రాకెట్ ముప్పు తప్పింది!

అసలే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుంటే గత కొద్ది రోజులుగా కొత్త భయం ప్రారంభమైంది.